Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా వైడ్ ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఇక ఆ స్టార్‌డమ్ తో నేషనల్ వైడ్ లో జరిగే కొన్ని సెలెబ్రెటీ ఈవెంట్స్ కి ప్రత్యేక ఆహ్వానం అందుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఆ మధ్య అంబానీ వారి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా వెళ్లారు. టాలీవుడ్ నుంచి ఆ ఆహ్వానం అందుకున్నది కేవలం రామ్ చరణ్ మాత్రమే.
ఇక ఇప్పుడు జరగబోయే పెళ్లి వేడుకకు కూడా చరణ్ కి ఆహ్వానం అందినట్లు సమాచారం. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో ఆల్రెడీ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఈ వేడుకకు బాలీవుడ్ టు హాలీవుడ్ నటులు, క్రీడా, రాజకీయ మరియు బిజినెస్ రంగంలోని ముఖ్య ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఈ పెళ్ళికి హాజరుకాబోతున్నారట. ఉపాసనతో కలిసి సతీసమేతంగా చరణ్ పెళ్ళికి వెళ్ళబోతున్నారు.
ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి వెళ్లిన సమయంలో రామ్ చరణ్ బాలీవుడ్ ఖాన్ త్రయంతో కలిసి స్టేజి పై నాటు నాటు స్టెప్ వేసి సందడి చేసారు. మరి ఈ పెళ్లి వేడుకల్లో చరణ్ ఎలా మెరవబోతున్నారో చూడాలి. ఇక ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండడంతో చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
ఇక చరణ్ సినిమాలు విషయానికి వస్తే.. ఇటీవలే గేమ్ ఛేంజర్ షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు బుచ్చిబాబుతో RC16 స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ చిత్రం.. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టుకుంటుందో చూడాలి.