మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసనలు పేరెంట్స్ గా ప్రమోషన్ పొందడానికి కొద్దిరోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో జంట తమ మొదటి బిడ్డ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. డాక్టర్స్ రిపోర్ట్స్ ప్రకారం.. ఉపాసన జూన్ 16 నుండి జూన్ 22 తేదీల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉంది.
దంపతులు గతంలో చెప్పినట్లుగా భారతదేశంలోని అపోలో ఆసుపత్రిలో ప్రసవం జరుగబోతోంది. మెగా కుటుంబంలోకి ఓ కొత్త వారుసుడు రాబోతుండటంతో అటు కుటుంబంలో, ఇటు ఫ్యామిలీలో ఎక్కడాలేని ఆనందం నెలకొంది. కాగా ఈ జంట జూన్ 14, 2012న పెళ్లి చేసుకుంది. దాదాపు దశాబ్దం పాటు తర్వాత చరణ్, ఉపాసన డిసెంబర్ 12, 2022న కలిసి తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నారనే వార్తలను ప్రకటించారు.
Also Read: Amit Shah Politics: బీజేపీ ఆకర్ష్.. రాజమౌళి, ప్రభాస్ తో అమిత్ షా భేటీ!