Site icon HashtagU Telugu

Ram Charan- Upasana: మహారాష్ట్ర సీఎంను కలిసిన రామ్ చరణ్, ఉపాసన

Ram Charan- Upasana

Safeimagekit Resized Img 11zon

Ram Charan- Upasana: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, భార్య ఉపాసన (Ram Charan- Upasana) ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కార్యాలయాన్ని సందర్శించారు. వారి కుమార్తె క్లిన్ కారా పుట్టి 6వ నెల అయిన సందర్భంగా మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రామ్ చరణ్, ఉపాసన ఆ తర్వాత మహారాష్ట్ర సీఎం నివాసానికి వెళ్లారు. షిండే కుమారుడు శ్రీకాంత్ కూడా అతిథులను స్వాగతించడానికి హాజరై ఇరు కుటుంబాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేశారు.

సీఎం ఏక్ నాథ్ షిండే నివాసంలో చరణ్, ఉపాసనలకు సంప్రదాయబద్ధ స్వాగతం లభించింది. షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండే, కోడలు వృషాలి తమ ఇంటికి వచ్చిన అతిథులకు ఘనస్వాగతం పలికారు. వృషాలి.. ఉపాసన నుదుటన కుంకుమ పెట్టి, హారతి ఇచ్చారు. అనంతరం షిండే, ఆయన కుటుంబ సభ్యులతో రామ్ చరణ్, ఉపాసన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు కానుకలు ఇచ్చి పుచ్చుకున్నారు. రామ్ చరణ్ కు సీఎం షిండే వినాయక విగ్రహాన్ని అందజేశారు. సీఎంను కలిసే సమయంలో బ్లూ డెనిమ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్‍ను రామ్‍చరణ్ ధరించగా.. ఉపాసన ఫ్లోరల్ కుర్తీ ధరించారు.

Also Read: Mukkoti Ekadashi : ముక్కోటి ఏకాదశి ఇవాళే.. శ్రీమహావిష్ణువుకే వరమిచ్చిన మధుకైటభుల పురాణగాథ

ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు రామ్‍చరణ్. ఆ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. ఆర్ఆర్ఆర్ బ్లాక్‍బాస్టర్ హిట్ తర్వాత తదుపరి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు రామ్‍చరణ్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.