Upasana: నేను, చరణ్ ఇద్దరు ఇక్కడే పుట్టాం.. ఆ సిటీ అంటే చాలా ఇష్టం.. ఉపాసన కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి మెగా గోడలు ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే. ఉపాసన తరచూ మంచి కార్యక్రమాలు చేయడంతో పాటు మరొకవైపు త

Published By: HashtagU Telugu Desk
Mixcollage 06 Feb 2024 12 04 Pm 2871

Mixcollage 06 Feb 2024 12 04 Pm 2871

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి మెగా గోడలు ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే. ఉపాసన తరచూ మంచి కార్యక్రమాలు చేయడంతో పాటు మరొకవైపు తన కూతురు అలాగే కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటుంది. ఈమె నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తనకూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఉపాసన. అప్పుడప్పుడు తన అభిమానులకు ఫాలోవర్లకు ఆరోగ్య సూచనలు కూడా ఇస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఉపాసన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా అపోలో హాస్పటల్ ఫౌండర్ డాక్టర్. ప్రతాప్ చంద్ర రెడ్డి 91వ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన ది అపోలో స్టోరీ అనే పుస్తకాన్ని లాంచ్ చేసింది. ప్రతాప్ చంద్ర రెడ్డి ఉపాసన తాతయ్య అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా తాతయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అనంతరం బుక్ ని లాంచ్ చేసింది.. అంతేకాకుండా ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించింది ఉపాసన. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా ఉపాసన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ పుస్తకాన్ని ప్రతి తండ్రి చదవాలని, ఈ బుక్ చదివి ప్రతి మహిళ స్ఫూర్తి పొందాలని తెలిపింది.

అనంతరం ప్రెస్ మీట్ లో భాగంగా చెన్నై సిటీ గురించి మాట్లాడుతూ.. నేను ఇక్కడే పుట్టాను. చరణ్ కూడా ఇక్కడే పుట్టాడు. నాకు చెన్నై సిటీ అంటే ఇష్టం. చరణ్ కి కూడా చెన్నై మీద ప్రేమ. చెన్నై సిటీ మా ఇద్దరికీ చాలా స్పెషల్. అటు కామినేని, ఇటు కొణిదెల కుటుంబాలపై తెలుగు వాళ్ళే కాదు తమిళనాడు ప్రజలు కూడా అభిమానం చూపిస్తున్నారు. అందుకు వారందరికీ ధన్యవాదాలు అని తెలిపింది ఉపాసన. ఈ మేరకు ఉపాసన చేసిన వ్యాఖ్యలు చేసిన మీడియాలో వైరల్ గా మారాయి.

  Last Updated: 06 Feb 2024, 12:04 PM IST