Site icon HashtagU Telugu

Ram Charan and Upasana: ఆఫ్రికా టూర్ ను ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్, ఉపాసన.. వీడియో వైరల్!

Ram Charan

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కొణిదెల ఆఫ్రికా కంట్రీ పర్యటనలో బెస్ట్ మూమెంట్స్‌ని ఆస్వాదిస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసన తమ ఇన్‌స్టాగ్రామ్ లో వెకేషన్ కు సంబంధించిన అద్భుతమైన క్షణాలను షేర్ చేసుకున్నారు. అడవి జంతువుల చూస్తూ, ప్రకృతి ఒడిలో రామ్ చరణ్ దంపతులు సేద తీరుతున్న ద్రుష్యాలను వీడియోలో చూడొచ్చు. అంతకుముందు షేర్ చేసిన ఆఫ్రికా టూర్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాంజానియాలోని కొన్ని వన్యప్రాణుల ఫొటోలను కూడా ఈ జంట షేర్ చేసింది.

అలాగే అక్కడి వర్కర్లతో కలిసి కుకింగ్‌లో ఓ చేయి వేశాడు. సఫారీ రన్నింగ్‌లో ఉండగానే ఫోటోలకు ఫోజులిచ్చాడు చరణ్‌.ఇక లేటెస్ట్‌గా ఈ సూపర్ కపుల్ మెగా పిక్స్ కొన్ని నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఆఫ్రికాలోని అందమైన ప్రదేశంలో ఆహ్లాదకరంగా గడుపిన క్షణాల్ని జ్ఞాపకంగా స్టిల్స్ తీసుకున్నారీ జంట.. చరణ్ హ్యాట్, గాగుల్స్‌తో కౌబాయ్‌లా ఉన్నాడు. ఉపాసన కూడా స్టైలిష్ లుక్‌లో కనిపించారు.. క్యూట్ కపుల్ అంటూ అభిమానులు, నెెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.