Ram Charan : రామ్ చరణ్ కూతుర్ని చూశారా..? సైడ్ లుక్‌లో చిన్నప్పటి చరణ్..

రామ్ చరణ్ కూతుర్ని చూశారా..? సైడ్ లుక్‌లో అచ్ఛం చిన్నప్పటి చరణ్ లా కనిపిస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Ram Charan Upasana Daughter Klin Kaara Photo Gone Viral

Ram Charan Upasana Daughter Klin Kaara Photo Gone Viral

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘క్లీంకార’ రాకతో ఫాదర్ హుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్క సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న చరణ్.. కొంచెం సమయం దొరికినా తన కూతురితో హ్యాపీ టైంని స్పెండ్ చేస్తున్నారు. కాగా రామ్ చరణ్ తన ముద్దుల కూతురి ఫేస్‌ని ఇప్పటివరకు రివీల్ చేయలేదు. అఫీషియల్ గా రివీల్ చేయలేదు గాని, క్లీంకార ఫేస్ చరణ్ పుట్టినరోజునే రివీల్ అయ్యిపోయింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో వెంకన్న సమక్షంలో క్లీంకార ఫేస్ కెమెరా లెన్స్ కి చిక్కింది.

అలా పేస్ రివీల్ అయిన తరువాత కూడా రామ్ చరణ్, ఉపాసన.. ఇంకా క్లీంకార ఫేస్ ని చూపించకుండానే వస్తున్నారు. కాగా ఉపాసన రీసెంట్ గా మదర్స్ డే సందర్భంగా ఓ పిక్ ని షేర్ చేసారు. క్లీంకార రాకతో ఉపాసన తన మొదటి మదర్స్ డేని జరుపుకుంటుండడంతో.. మెగా ఫ్యామిలీ కొంచెం స్పెషల్ గానే సెలబ్రేట్ చేసారు. ఇక ఈ మదర్స్ డే సందర్భంగా ఉపాసన.. తన తల్లి మరియు కూతురితో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.

ఆ పిక్ లో కూడా క్లీంకార ఫేస్ ని చూపించలేదు. సైడ్ లుక్ లో మాత్రమే క్లీంకార కనిపిస్తుంది. ఇక ఈ లుక్ చూస్తుంటే.. చరణ్ అభిమానులకు ఎక్కడో చూసినట్లు అనిపించింది. దీంతో ఎక్కడ చూశామా అంటూ తెగ అలోచించి కనిపెట్టేసారు. రామ్ చరణ్ చిన్నతనంలో చిరంజీవి ముద్దాడుతూ ఒక ఓల్డ్ పిక్ లోని చరణ్ సైడ్ లుక్స్, ఇప్పటి క్లీంకార సైడ్ లుక్ ఒకేలా అనిపిస్తుంది. దీంతో ఈ రెండు పిక్స్ ని పక్క పక్కనే పెట్టి షేర్ చేస్తూ చరణ్ అభిమానులు సంబరపడుతున్నారు.

  Last Updated: 13 May 2024, 05:00 PM IST