Klin Kaara Konidela : మరోసారి ఫ్యాన్స్ తో దోబూచులాడిన ఉపాసన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన (Ram CHaran – Upasana) దంపతులు పండంటి ఆడబిడ్డ (Klin Kaara Konidela) కు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ పాప పుట్టి ఏడాది కావొస్తున్నా ఇంతవరకు ఈ పాప పేస్ ను మాత్రం పూర్తిగా షేర్ చేయలేదు. ఈ పాప పుట్టిన దగ్గరి నుండి మెగా ఫ్యామిలీ ఇంట ఎన్నో వేడుకలు జరుగుతున్నప్పటికీ..ఫ్యాన్స్ కు మాత్రం ఇప్పటి వరకు పాప పేస్ ను చూపించకుండా దోబూచులాడుతున్నారు. నిన్న […]

Published By: HashtagU Telugu Desk
Ram Charan Upasana Daughter

Ram Charan Upasana Daughter

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన (Ram CHaran – Upasana) దంపతులు పండంటి ఆడబిడ్డ (Klin Kaara Konidela) కు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ పాప పుట్టి ఏడాది కావొస్తున్నా ఇంతవరకు ఈ పాప పేస్ ను మాత్రం పూర్తిగా షేర్ చేయలేదు. ఈ పాప పుట్టిన దగ్గరి నుండి మెగా ఫ్యామిలీ ఇంట ఎన్నో వేడుకలు జరుగుతున్నప్పటికీ..ఫ్యాన్స్ కు మాత్రం ఇప్పటి వరకు పాప పేస్ ను చూపించకుండా దోబూచులాడుతున్నారు. నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్బంగా చిరంజీవి ఇంట శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

We’re now on WhatsApp. Click to Join.

రామ్ చరణ్, ఉపాసన గారాల పట్టి క్లింకారాతో కలిసి ఈ పండగను జరుపుకొంది. అనంతరం పూజకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. ‘అమ్మ, కారా స్వీట్ సింపుల్ పూజా’ అని ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఇందులో కూడా క్లింకార ఫేస్ చూపించకుండా దాచేసారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఉపాసనతో పాటు రామ్ చరణ్, చిరంజీవి, సురేఖ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఈసారి కూడా పాప పేస్ ను చూపించకపోయేసరికి అభిమానులు కాస్త నిరాశ కు గురయ్యారు.

ఇక చరణ్ – చిరంజీవి సినిమాల విషయానికి వస్తే..చరణ్ గేమ్ చెంజర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా..చిరంజీవి విశ్వంభర తో రాబోతున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ లు చకచకా జరుగుతున్నాయి.

Read Also : Abhishek Singhvi : రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం

  Last Updated: 27 Aug 2024, 05:31 PM IST