గ్లోబల్ స్టార్ రాం చరణ్ (Ram Charan) ఆయన సతీమణి ఉపాసన (Upasana) ఇద్దరు కలిసి క్రిమస్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఐతే వీరు ఇద్దరు తమ దగ్గర పనిచేస్తున్న పని వాళ్ల సమక్షంలో వారితో కలిసి ఈ వేడుక జరుపుకున్నారు. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చరణ్, ఉపాసన ఇద్దరు వారి దగ్గర పనిచేస్తున్న వారితో ఎంత సరదాగా ఉంటారు. వాళ్లకి ఎంత ఇంపార్టన్స్ ఇస్తారన్నది తెలిసిపోయింది.
చరణ్ అలా చిన్న చెయిర్ మీద కూర్చోగా ఉపాసన మాత్రం వాళ్లతో అలా నేల మీద కూర్చుని ఫోటోకి ఫోజులు ఇచ్చింది. తమ దగ్గర పనిచేసే పని వాళ్లను కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ లాగా వారు ట్రీట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. రాం చరణ్, ఉపాసన ఇద్దరి జంట చేస్తున్న ఇలాంటి పనుల వల్ల ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.
అంతేకాదు అంత పెద్ద స్టార్ హీరో, బిజినెస్ ఉమెన్ అయినా కూడా రాం చరణ్, ఉపాసనలు వాళ్ల పని వారితో ఎంత ప్రేమగా ఉంటున్నారో ఫోటో చూస్తే అర్ధమవుతుంది. వీరంతా కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనగా అంతా కలిసి దిగిన ఫోటో మాత్రం మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. అంతే కాదు ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కూడా రాం చరణ్, ఉపాసనలను ప్రశంసిస్తున్నారు. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే సంక్రాంతికి గేమ్ ఛేంజర్ (Game Changer) గా రాబోతున్నాడు. ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేయగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు.