Site icon HashtagU Telugu

RC 15 : మళ్లీ బాలీవుడ్ లోకి రాంచరణ్.. శంకర్ దర్శకత్వంలో ‘ఆర్సీ15’

అల్లు అర్జున్ నటించిన పుష్ప, రామ్ చరణ్ తేజ్ నటించిన RRR సినిమాలు రెండూ పాన్ ఇండియా విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈనేపథ్యంలో బాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్లను అల్లు అర్జున్ ఇంకా పరిశీలిస్తూనే ఉండగా.. రాంచరణ్ మాత్రం అడుగు ముందుకు వేసి ఒక మూవీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. భారతీయుడు, జీన్స్, నాయక్, రోబో వంటి వైవిధ్య సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శంకర్.. త్వరలో తీయనున్న సినిమాకు రామ్ చరణ్ పచ్చజెండా ఊపారు. రామ్ చరణ్ డబల్ యాక్షన్ చేసే ఈసినిమాకు ‘ ఆర్సీ 15’ అని పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2013లో బాలీవుడ్ మూవీ ‘జంజీర్’ లో రాంచరణ్ హీరోగా నటించారు. అది 1973 లో అమితాబ్ బచ్చన్ నటించిన ఒక సినిమాకు రీమేక్. ఇటీవల RRR సినిమాతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన రామ్ చరణ్ ఇదే ఊపును కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో బాలీవుడ్ లో అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారట.

Exit mobile version