Site icon HashtagU Telugu

Ram Charan: ఆ కోరిక నాకూ ఉంది.. ఉపాసనా వెయిట్ చెయ్ : రాంచరణ్

ram charan and upasana

ram charan and upasana

హీరో రాంచరణ్ ఎంత బిజీగా ఉన్నా.. కాస్త విరామం దొరకగానే సతీమణి ఉపాసనతో కలిసి వెకేషన్స్‏కు వెళ్తుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల దాదాపు మూడు సంవత్సరాల పాటు రాం చరణ్, ఉపాసన దంపతులు వెకేషన్స్ కు దూరంగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు వీరిద్దరు కలిసి ఫిన్లాండ్ టూర్ కు వెళ్ళొచ్చారు. ఇటీవల ఉపాసన కొణిదెల తమ ఫిన్లాండ్ వెకేషన్ ఫోటోను షేర్ చేస్తూ.. మండుటెండల్లో మళ్లీ ఎక్కడికైనా చల్లని ప్రదేశానికి చెక్కే యాలని ఉందని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ఆమె పోస్ట్ కు చరణ్ స్పందిస్తూ.. ” నా మనసులో కూడా హాలీడేకు వెళ్లాలని ఉంది.. కాకపోతే ‘ఆర్సీ 15’ మూవీ షూట్ విశాఖలో జరుగుతున్న కారణంగా మనం ఇంకొంత సమయం వేచి ఉండాల్సిందే” అంటూ పాత వెకేషన్ ఫోటోస్ షేర్ చేశారు చరణ్. ఇన్ స్టాగ్రామ్ లో తన పోస్టుకు ఉపాసనను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం చరణ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

బిజీ బిజీ..

ప్రస్తుతం చెర్రీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 మూవీ షూటింగ్‏లో పాల్గొంటున్నాడు. ఇందులో చరణ్.. ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని టాక్. చరణ్ 15వ చిత్రం ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. దాదాపు ఓ వారం పాటు ఈ షెడ్యూల్ ఉండనుంది. వైజాగ్ షెడ్యూల్ ముగిసిన వెంటనే చరణ్ కొంత గ్యాప్ తీసుకోనున్నట్లు సమాచారం.