Site icon HashtagU Telugu

Ram Charan Tang Changed : చరణ్ ట్యాగ్ మారింది మెగా ఫ్యాన్స్ గమనించారా..?

Ram Charan Tag Changed Mega Power Star To Global Star

Ram Charan Tag Changed Mega Power Star To Global Star

Ram Charan Tag Changed మొన్నటిదాకా మెగా పవర్ స్టార్ గా ఉన్న రాం చరణ్ ట్యాగ్ కాస్త ఇప్పుడు మారిపోయింది. RRR తో గ్లోబల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న రాం చరణ్ గ్లోబల్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే ట్యాగ్ ని చరణ్ స్క్రీన్ నేం పెట్టేశారు. సో మొన్నటిదాకా ఉన్న మెగా పవర్ స్టార్ ట్యాగ్ కాస్త గ్లోబల్ స్టార్ రాం చరణ్ అని మార్చేశారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆచార్య సినిమా చేసిన చరణ్ ఆ మూవీతో డిజాస్టర్ అందుకోగా ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేం చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కుదిరితే దసరాకి లేదా డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది.

ఇక ఈ సినిమా తర్వాత చరణ్ 16వ సినిమాగా బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా వస్తుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈమధ్యనే జరిగాయి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వృద్ధి సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ముహూర్త్వం వీడియో రిలీజ్ చేశారు. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ స్పెషల్ వీడియోలో చరణ్ ట్యాగ్ మెగా పవర్ స్టార్ బదులుగా గ్లోబల్ స్టార్ అని వేశారు.

RRR తో ఎన్.టి.ఆర్ కూడా గ్లోబల్ క్రేజ్ తెచ్చుకోగా తారక్ ట్యాగ్ ని మాన్ ఆఫ్ మాసెస్ అని మార్చారు. దేవర సినిమాకు ఎన్.టి.ఆర్ కు మాన్ ఆఫ్ మాసెస్ ట్యాగ్ వస్తుంది. చరణ్ కు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వస్తుంది. మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య ఈ ట్యాగ్ ల డిస్కషన్ మళ్లీ షురూ కానుందని చెప్పొచ్చు.