Site icon HashtagU Telugu

Ram Charan : ప్రమాదానికి గురైన హీరో రామ్ చరణ్..?

Ram Charan Suffers Injury

Ram Charan Suffers Injury

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రమాదానికి (Injury ) గురయ్యాడా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు..సోషల్ మీడియా. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చరణ్..ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తాలూకా షెడ్యూల్స్ కూడా చాల వరకు పూర్తి అయ్యాయి. అతి త్వరలో కొత్త షెడ్యూల్ ను ప్రారభించబోతున్నారు. ఈ తరుణంలో చరణ్ ప్రమాదానికి గురయ్యాడనే వార్త చిత్ర యూనిట్ తో పాటు మెగా అభిమానులను షాక్ కు గురి చేస్తుంది. ఇంట్లో ఏదో పని చేస్తుండగా..అనుకోని ప్రమాదం జరిగిందని..ఈ ప్రమాదంలో తన ముఖానికి చిన్న పాటి గాయం అయిందని తెలుస్తుంది. ప్రస్తుతం డాక్టర్స్.. చరణ్ ను పది రోజుల పాటు రిస్ట్ తీసుకోవాలని సూచించారట. ఈ ప్రమాదం ఫై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ..మీడియా లో మాత్రం వైరల్ గా మారింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది..ఎలాంటి గాయం అయ్యింది..డాక్టర్స్ పూర్తిగా ఏంచెప్పారు అనేది తెలియాల్సి ఉంది.

Read Also : Hyderabad: క్షుద్ర పూజలతో పట్టుబడిన ఆయుర్వేద వైద్యుడు అరెస్ట్

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఇంట (Chiranjeevi House) ఈ ఏడాది ‘కొణిదెల క్లింకారా'(Klin Kaara) రాకతో ఈ ఏడాది వినాయక చవితి పండగ మరింత ఉత్సహం నింపింది. చరణ్ ఉపాసనలకి జూన్ 20న పాప పుట్టిన సంగతి తెలిసిందే. ఈ మెగా ప్రిన్సెస్‌ క్లింకారా పుట్టినప్పటి నుంచి ఉపాసన వాళ్ల ఇంట్లో ఉంది. ఇక ఇప్పుడు ఉపాసన పాపతో మొదటిసారి చిరంజీవి ఇంట అడుగుపెట్టింది. కుటుంబంతో కలిసి చరణ్, ఉపాసన వినాయక చవితి పండగ చేసుకున్నారు. మొదటి పండగ మానవరాలితో చేసుకోవడం చిరంజీవికి చాలా స్పెషల్ గా నిలిచింది. రామ్ చరణ్ తన హ్యాపినెస్ ని షేర్ చేసుకుంటూ… ‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈ సారి ప్రత్యేకత … చిన్ని ‘క్లిన్ కారా’ తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం’ అంటూ కోట్ చేసి సోషల్ మీడియాలో ఫోటోస్ పోస్ట్ చేసాడు. వినాయక చవితి పూజలో చిరంజీవితో పాటు తన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసనతో పాటు చిరంజీవి కూతుళ్లు, వారి పిల్లలు కూడా పాల్గొన్నారు. మరోవైపు నాగబాబు కూడా తన ఫ్యామిలీతో పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. అంతా కలిసి ఇలా పూజ చేయడం, ఫోటోలు షేర్ చేయడం కనులవిందుగా ఉందని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు.