Site icon HashtagU Telugu

Ram Charan : రామ్ చరణ్, శ్రియా ఒకే స్కూల్‌లో కలిసి యాక్టింగ్ నేర్చుకున్నారు.. అప్పటి వీడియో చూశారా..?

Ram Charan Shriya Saran Acting School Video goes Viral

Ram Charan Shriya Saran Acting School Video goes Viral

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. ‘చిరుత’ సినిమాతో తెరగేంట్రం చేసి నేడు గ్లోబల్ స్థాయి గుర్తింపుని సంపాదించుకొని స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్నారు. కాగా అందరి నటులు మాదిరే రామ్ చరణ్ కూడా తన డెబ్యూట్ ముందు యాక్టింగ్ లో మెళకువలు నేర్చుకోవడానికి యాక్టింగ్ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ముంబైలోని ‘కిషోర్ నమిత కపూర్’ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ లో రామ్ చరణ్ యాక్టింగ్ కోర్స్ తీసుకున్నారు. ఆ సమయంలోనే చరణ్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ కూడా యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.

ఆ స్కూల్ లో రామ్ చరణ్ అండ్ శ్రియా శరణ్(Shriya).. యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఇద్దరు కలిసి పలు నాటకాలు కూడా ప్రదర్శించారు. ఈక్రమంలోనే చరణ్, శ్రియా కలిసి ప్రాక్టీస్ చేసిన ఓ లవ్ సీన్ వీడియో నెట్టింట అందుబాటులో ఉంది. ఆ వీడియోలో రామ్ చరణ్ డిఫరెంట్ షేవింగ్ తో కొత్తగా కనిపిస్తున్నారు. శ్రియా, చరణ్ ని గమనిస్తే.. ముస్లిం అబ్బాయి, అమ్మాయి పాత్రలని పోషించినట్లు అనిపిస్తుంది. కాగా ఇద్దరు కలిసి ఒక స్కూల్ లో ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ శ్రియా ముందుగా తెరగేంట్రం చేశారు. 2001లో తెలుగు సినిమా ‘ఇష్టం’తో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేశారు.

రెండో సినిమాగా నాగార్జున ‘సంతోషం’, మూడో సినిమా బాలయ్య ‘చెన్నకేశవరెడ్డి’, ఆ తరువాత ఠాగూర్, బాలు, అర్జున్.. ఇలా టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. 2007లో ‘చిరుత’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఒక్కో సినిమాలో నటుడిగా తనని తాను మెరుగు పరుచుకుంటూ నేడు ఇంటర్నేషనల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే, రామ్ చరణ్ తో కలిసి యాక్టింగ్ నేర్చుకున్న శ్రియా.. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ కి అమ్మ పాత్రలో నటించారు. అయితే ఇద్దరు కలిసి ఒకే సీన్ లో తల్లి కొడుకులుగా కనిపించలేదు.

Also Read : Telugu Music Directors : పదిమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసి పాడిన.. ఆర్పీ పట్నాయక్ కోసం.. ఆ పాట ఏంటో తెలుసా..?