Viral Pic: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘చికిరి చికిరి’ పాట హవానే కనిపిస్తోంది. రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది నుండి వచ్చిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, ఫ్యాన్స్‌ను నాన్‌స్టాప్‌గా స్టెప్పులు వేయించేలా చేస్తోంది. ఒకవైపు ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న రామ్ చరణ్, తాజాగా తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించి వార్తల్లో నిలిచారు.
సల్మాన్ పుట్టినరోజు వేడుకల్లో తారల సందడి
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో ఒక భారీ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా సినీ పరిశ్రమతో పాటు క్రీడారంగం నుండి క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని కూడా విచ్చేశారు.
ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. అందులో సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, ఎంఎస్ ధోని, బాబీ డియోల్ కలిసి ఏదో లోతైన చర్చలో మునిగిపోయి కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో రామ్ చరణ్ లుక్ ఎంతో ‘స్వావ్’గా ఉంది. వివిధ రంగాలకు చెందిన ఈ నలుగురు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోను విపరీతంగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. వీరు నలుగురు అంత సీరియస్‌గా దేని గురించి చర్చిస్తున్నారో అని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
Also Read: మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్.. 2025లో విజయాలు, భారత్ గర్వించదగ్గ క్షణాలీవే!
‘పెద్ది’ అప్‌డేట్స్.. మార్చి 27న రచ్చ!
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే.. ఈ చిత్రం 2026 మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. బుచ్చిబాబు సానాకు ఇది మొదటి పాన్-ఇండియా మూవీ కావడం, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
