Ram Charan : మెగా జంట రామ్ చరణ్, ఉపాసనను తమ పెళ్ళైన పదేళ్ల తరువాత తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి.. 2023 జూన్ 20న మెగా వారి ఇంటలోకి ‘క్లీంకార’ అనే మహాలక్ష్మి తీసుకొచ్చారు. ఈ మెగా వారసురాలు క్లీంకార రాకతో కుటుంబసభ్యులు, అభిమానులు తెగ సంబరపడ్డారు. ఇక తండ్రిగా మారిన రామ్ చరణ్ ఈ ఏడాది తన మొదటి ఫాదర్స్ డేని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చరణ్ ఓ నేషనల్ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో క్లీంకార గురించి అనేక విషయాలను పంచుకున్న రామ్ చరణ్.. తన కూతుర్ని సినిమాల్లోకి తీసుకు రానని చెప్పుకొచ్చారు. అందుకు గల కారణం కూడా తెలియజేసారు. తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవితో స్టార్ట్ అయిన మెగా జర్నీ.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శిరీష్ అంటూ చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా తమ ఫ్యామిలీ నుంచి చాలామంది స్టార్స్ రావడంతో.. సినిమా రిలీజ్స్ కోసం తమలో తామే కొట్టుకోవాల్సి వస్తుందని, అందుకే తన కూతుర్ని సినిమాల్లోకి తీసుకు రాకూడదని చరణ్ నిర్ణయించుకున్నారట.
సినిమా ఇండస్ట్రీలోకి కాకుండా ఉపాసన ప్రొఫిషన్ వైపు పంపించాలని రామ్ చరణ్ డిసైడ్ అయ్యారట. మరి భవిషత్తులో క్లీంకార ఎటువైపు అడుగులు వేస్తుందో చూడాలి. కాగా ఈ మెగా వారసురాలి ఫేస్ ని రామ్ చరణ్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు. మరో నాలుగు రోజుల్లో క్లీంకార తన మొదటి పుట్టినరోజుని జరుపుకోబోతుంది. మరి ఆ రోజునైనా చరణ్ తన కూతురి ఫేస్ ని రివీల్ చేస్తారేమో చూడాలి.