హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడ‌ర్ రామ్ చ‌ర‌ణ్ కు 5కోట్ల పై మాటే

  • Written By:
  • Publish Date - September 17, 2021 / 03:23 PM IST

ఈ కాలంలో బ్రాండ్ అంబాసిడ‌ర్ల మీద బిజినెస్ ఆధార‌ప‌డి ఉంటుంది. చిన్నాచిత‌క కంపెనీలు కూడా త‌మ త‌హ‌తుకు త‌గిన బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌ను పెట్టుకుంటున్నాయి. ఇక‌, డిస్నీ హాట్ స్టార్ పెట్టుకునే అంబాసిడ‌ర్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. దాని స్థాయికి త‌గిన విధంగా ఎంపిక‌, ఖ‌రీదు ఉంటాయ‌ని అంద‌రికీ తెలుసు. ఇంత‌కీ ఆ ఖ‌రీదైన అంబాసిడ‌ర్ ఎవ‌రో తెలుసా…మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన చిరుత మ‌న రామ్ చ‌ర‌ణ్ తేజ్. ఏడాదికి 5 నుంచి 7 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డం ద్వారా చ‌ర‌ణ్ ను ఎంపిక చేసుకుంద‌ని టాలీవుడ్ టాక్. ఓటీటీ ప్లాట్ ఫాం మీద హాట్ స్టార్ క్రేజ్ మ‌నంద‌రికీ తెలిసిందే. పైగా క‌రోనా త‌రువాత ఓటీటీ ప్లాట్ ఫాంల‌కు ప్రేక్ష‌కులు అల‌వాటు ప‌డ్డారు. ఆ క్రేజ్ కు త‌గిన విధంగా అంబాసిడ‌ర్ గా రామ్ చ‌ర‌ణ్ ను ఎంపిక చేసుకుంద‌ట‌. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. అక్టోబ‌ర్ 13న విడుద‌ల‌కు సిద్దం చేస్తున్నార‌ని టాలీవుడ్ లో టాక్ ఉన్న‌ప్ప‌టికీ నిజంకాద‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంద‌ని సినీ వ‌ర్గాల చ‌ర్చ జ‌రుగుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని త్రిబుల్ ఆర్ విడుద‌ల ఇంకొంత ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. విడుద‌ల తేదీని ఖ‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో సినీ వ‌ర్గాలు ఉన్నారు. ఆ లోపు మెగా చిరుత‌కు బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చి ప‌డింద‌ట‌. అదే, డిస్నీ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడ‌ర్. దీనికి సంబంధించిన రాత‌పోత‌లు అన్నీ అయ్యాయ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ ద‌క్క‌ని రెమ్యున‌రేష‌న్ హాట్ స్టార్ ఇస్తోంద‌ని సినీ, ఓటీటీ వ‌ర్గాల్లో బ‌ల‌మైన టాక్. సో..ఇక హీరోల‌కు ఓటీటీ బ్రాండ్ అంబాసిడ‌ర్ల డిమాండ్ రాబోతుంద‌న్న‌మాట‌