గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి మెగాస్టార్ చిరంజీవి సాంగ్ ను రీమిక్స్ చేయబోతున్నాడా..? ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో , మెగా అభిమానుల్లో ఇదే చర్చ నడుస్తుంది. RRR తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చరణ్..ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. సంచలన డైరెక్టర్ శంకర్ (Shankar) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, అంజలి, నవీన్ చంద్ర ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, హిందీల్లో రిలీజ్ కానుంది.
కాగా రామ్ చరణ్..మెగాస్టార్ హిట్స్ సాంగ్స్ లలో ఒకటైన రాధే గోవిందా (Radhe Govinda Song Remix) సాంగ్ ను రీమిక్స్ చేయబోతున్నాడనే వార్త అభిమానుల్లో సంబరాలు నింపుతుంది. బి గోపాల్ డైరెక్షన్లో చిరంజీవి , ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే జంటగా 2002లో విడుదలైన మూవీ ఇంద్ర (Indra ). ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాలిన పనిలేదు. ఇంద్రన్న..ఇంద్రన్న అంటే అప్పట్లో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
వైజయంతీ మూవీస్ పతాకంపై వచ్చిన ఈ మూవీని సి. అశ్వనీదత్ నిర్మించాడు. ఇక ఈ చిత్రంలోని సాంగ్స్ కు కూడా అప్పట్లో భారీ రెస్పాన్సే అందుకున్నాయి. ఇప్పటికీ ఈ చిత్రంలోని సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ‘రాధే గోవిందా’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే, అలాంటి ఈ సాంగ్ మరోసారి రీమిక్స్ రూపంలో.. అది కూడా రామ్ చరణ్ తో రాబోతున్నట్లు వినికిడి. మరి ఈ సాంగ్ ను ఏ సినిమాలో చరణ్ వాడుతున్నాడో తెలియాల్సి ఉంది. గతంలో మగధీర మూవీ లో బంగారు కోడిపెట్ట సాంగ్ ను రీమిక్స్ చేసి అలరించాడు.
ఇక చిరంజీవి విషయానికి వస్తే…వాల్తేర్ వీరయ్య తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరు..ఇప్పుడు భోళా శంకర్ అంటూ ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలోని పలు సాంగ్స్ , ట్రైలర్ విడుదలై సినిమా ఫై అంచనాలు పెంచేసాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Read Also: BRO : విజయవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకున్న బ్రో టీం