Site icon HashtagU Telugu

Bhola Shankar Trailer: భోళా శంకర్ ట్రైలర్ ఆగయా.. మెగా ఫ్యాన్స్ కు పూనకాలే!

Bhola Shankar

Bhola Shankar

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భోళా శంకర్. కొద్దిసేపటి క్రితమే రాంచరణ్ ఈ మూవీని ట్రైలర్ ను విడుదల చేశారు. మాస్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ లో పుష్కలంగా ఉన్నాయి. ట్రైలర్ లోకి వెళ్తే జాతర సీన్ల నుంచి ప్రారంభమైంది. వరుసగా అమ్మాయిలు, చిన్నపిల్లలు మిస్‌ అవుతుంటారు. చివరకు ఔరాలోనూ ఆ మిస్సింగ్‌ కేసులు నమోదవుతుంటాయి. హీరో ఆపరేషన్ మొదలు పెడుతండగానే, విలన్‌ ఎంట్రీ ఇస్తాడు. తనదైన భారీ డైలాగులతో రెచ్చిపోతున్న నేపథ్యంలో గూస్‌ బంమ్స్ తెప్పించేలా ఫైటింగ్‌ సీన్లతో మెగాస్టార్‌ చిరంజీవి ఎంట్రీ ఇస్తారు.

నా వెనుక దునియా ఉందని చిరు చెప్పడం, రంగస్థలం బాబులా నటిస్తున్నాడని తమన్నా చెప్పించడం వగైరా అంతా ఫ్యాన్ స్టఫ్ లా పెట్టేశారు. కామెడీ ట్రాక్, ఫ్యామిలీ ఎమోషన్స్, విలన్స్ ఛేజింగ్ లాంటివి ఆకట్టుకుంటాయి. ఇక చిరంజీవి వింటేజ్ హీరోలా కనిపిస్తూ తన నటనతో మెస్మరైజ్ చేస్తాడు.  ట్రైలర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. అయితే ఇందులో చిరంజీవి చాలా యంగ్‌గా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. కీర్తి సురేశ్, తమన్నా ఈ మూవీలో కనిపిస్తుండటం మరిన్ని అంచనాలు ఏర్పడేలా చేసింది.

వేదాళంకు పెద్దగా మార్పులు చేయకపోయినా చిరు బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు సబ్జెక్టుని సెట్ చేసినట్టు అర్థమవుతోంది. యాక్టర్స్ అందరినీ రివీల్ చేశారు. కంటెంట్ కు తగ్గట్టే మహతి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గట్టిగా ఉంది. ఈ మూవీ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో చిరు చెల్లిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా, హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది.

Also Read: KTR Review: వరద బాధితులకు అండగా ఉండండి, పార్టీ నేతలకు కేటీఆర్ పిలుపు