Site icon HashtagU Telugu

Ram Charan : చరణ్ నో చెప్పడంతో ఆ హీరో దగ్గరకు డైరెక్టర్..!

Ram Charan Rejected Kollywood Director Picked that Movie

Ram Charan Rejected Kollywood Director Picked that Movie

గ్లోబల్ స్టార్ రాం చరణ్ (Ram Charan) తో సినిమా చేయాలని కన్నడ డైరెక్టర్ నర్తన్ చాలా ప్రయత్నాలు చేశాడు. శాండల్ వుడ్ లో తన డైరెక్షన్ టాలెంట్ తో సత్తా చాటుతున్న నర్తన్ అక్కడ శివ రాజ్ కుమార్ తో తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా మఫ్తీ సినిమాతో అక్కడ రికార్డులు క్రియేట్ చేశాడు. మఫ్రీ సీక్వెల్ గానే ప్రస్తుతం రణగల సినిమా వస్తుంది. నర్తన్ కు తెలుగులో సినిమా చేయాలనే ఆశ ఉంది. అందుకే ఆమధ్య చరణ్ ని కలిసి కథా చర్చలు నిర్వహించాడు.

చరణ్ కి కథ బాగున్నా కూడా ఎందుకో ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వలేదు. ఇక చరణ్ ని వదిలిపెట్టి ఇప్పుడు కోలీవుడ్ స్టార్ సూర్య (Surya)ని పట్టుకున్నాడు నర్తన్. సూర్యకు కథ చెప్పగా దాదాపు ఓకే అన్నట్టు తెలుస్తుంది. నర్తన్ సూర్య ఈ కాంబో కచ్చితంగా ఫ్యాన్స్ ని స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. కన్నడలో తన మాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నర్తన్ సూర్యతో నెక్స్ట్ లెవెల్ సినిమా ప్లానింగ్ చేస్తున్నాడట.

Also Read : Keerti Suresh : మహానటి ఆ ఒక్క పని వల్ల దారుణమైన ట్రోల్స్..!

సూర్య కూడా ఈమధ్య మాస్ సినిమాలు చేసి చాలా రోజులు అవుతుంది. అందుకే నర్తన్ (Narthan) కథ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సూర్య తో సినిమా తీస్తే అటు తమిళ్ లోనే కాదు ఇటు తెలుగులో కూడా సినిమా భారీగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే సూర్యని కలిశాడు నర్తన్. సూర్య ప్రస్తుతం కంగువ సినిమా చేస్తున్నాడు. దీపావళి కానుకగా ఆ సినిమా రిలీజ్ కాబోతుంది.

కంగువ తో పాటుగా సుధా కొంగరతో ఒక సినిమా.. కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju)తో మరో సినిమా చేస్తున్నాడు సూర్య. ఈ రెండు సినిమాలు పూర్తి చేశాకనే నర్తన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. నర్తన్ సూర్య కాంబో సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందని టాక్.