Site icon HashtagU Telugu

Charan Gift For Salman: సల్మాన్ కు ‘మెగా’ గిఫ్ట్.. కాస్ట్ లీ కారుకు చరణ్ ప్లాన్!

Chiru And Salman

Chiru And Salman

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల విడుదలైన ‘గాడ్ ఫాదర్’ మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అతని పాత్ర తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ, నార్త్ ఇండియాలో కలెక్షన్లకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. చాలా మంది అభిప్రాయం ప్రకారం సల్మాన్ కొంచెం అసహజంగా, అతిగా కనిపించాడు. కానీ సినిమా హిట్ కావడంతో మెగాస్టార్ కృతజ్ఞతగా సల్మాన్‌కి ఏదైనా తిరిగి ఇవ్వాలని ఆశిస్తున్నాడు.

“సల్మాన్ కు రెమ్యునరేషన్ ఇవ్వమని ఆఫర్ చేసినప్పుడు సున్నితంగా రిజెక్ట్ చేశాడు’’ అని చిరంజీవి చెప్పాడు. ‘రామ్ (చరణ్) పట్ల నా ప్రేమను కొనలేరు. చిరంజీవి గారిని ప్రేమను డబ్బుతో కొనలేరని సల్మాన్ అన్నారు’’ అని చిరంజీవి అన్నారు. కాబట్టి చరణ్ అతనికి రెమ్యూనరేషన్ ఇచ్చే స్థానంలో కారును బహుమతిగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఖరీదైన కారు మోడల్‌ను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. త్వరలో దీనిని గిఫ్ట్ గా ఇస్తారని టాలీవుడ్ టాక్. చిరుతో పాటు, సత్యదేవ్ కూడా నటనకు చాలా ప్రశంసలు అందుకుంటున్నారు నయనతార ఎప్పటిలాగే గొప్పగా నటించింది.