Site icon HashtagU Telugu

Ram Charan: పుట్టినరోజు సరికొత్త రికార్డు సృష్టించిన రామ్ చరణ్.. నాలుగు రోజుల్లో అలా?

Ram Charan New Record

Ram Charan New Record

నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు అన్న విషయం మనందరికీ తెలిసిందే. చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి నేడు తనకంటూ ఒక ఇమేజ్‌ని, ఒక ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒకేసారి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే సినిమా సినిమాకి చరణ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం చరణ్ క్రేజ్ పెరుగుతూ పోతుంది. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కౌంట్ కూడా రోజురోజుకి రెట్టింపు అవుతూ వస్తుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, ప్రభాస్.. అత్యధిక ఫాలోవర్స్ తో సోషల్ మీడియా స్టార్స్ అనిపించుకుంటున్నారు. మొన్న ఆదివారం వరకు ఈ ఐదుగురు స్టార్స్ లో రామ్ చరణ్ మూడో స్థానంలో నిలిచారు. అందుకు సంబంధించిన గణాంకాల సమాచారాన్ని నాలుగు రోజుల క్రితమే ప్రముఖ మీడియా తెలియజేసింది. అయితే ఈ నాలుగు రోజుల్లోనే చరణ్ తన ఫాలోయింగ్ ని ఒక రేంజ్ లో పెంచుకున్నారు చెర్రీ. నాలుగురోజుల క్రితం రామ్ చరణ్ 21.1 మిలియన్ ఫాలోవర్స్ అంటే రెండు కోట్ల 11 లక్షల మంది ఫాలోవర్స్ తో అవుతున్నారు.

ఇక నాలుగు రోజుల్లో చరణ్ ఫాలోవర్స్ కౌంట్ 16 లక్షలు పెరిగిపోయింది. నేటికీ మార్చి 27 రామ్ చరణ్ బర్త్ డే మెగాపవర్ స్టార్ ఇన్‌స్టా ఫాలోవర్స్ కౌంట్.. 21.7 మిలియన్ దగ్గర ఉంది. ఇక ఈ కౌంట్ తో రెండో స్థానంలో ఉన్న విజయ్ దేవరకొండని వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని చరణ్ తీసుకున్నారు. విజయ్ దేవరకొండ కౌంట్ మొన్న ఎలా ఉందో.. ఇప్పుడు కూడా 21.4 మిలియన్ తో అలాగే ఉంది. ఇక మొదటి స్థానంలో ఉన్న అల్లు అర్జున్ 25.1 మిలియన్ కౌంట్ తో ఉన్నారు. కాగా బర్త్ డే రోజునే రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్ లో సెకండ్ ప్లేస్ ని సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ఈ స్పీడ్ చూస్తుంటే చరణ్ రానున్న రోజుల్లో అల్లు అర్జున్ ప్లేస్ ని కూడా కబ్జా చేసేలా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version