Site icon HashtagU Telugu

Ram Charan : కమల్, రజినితో పాటు ఒకే స్టేజిపై కనిపించబోతున్న రామ్ చరణ్..

Ram Charan Rajinkanth Kamal Haasan In Indian 2 Audio Launch

Ram Charan Rajinkanth Kamal Haasan In Indian 2 Audio Launch

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇన్నాళ్లు ఇండియన్ 2 షూటింగ్ వల్ల ఈ సినిమాని ఆలస్యం చేస్తూ వచ్చిన శంకర్.. ఇండియన్ 2 చిత్రీకరణ మొత్తం పూర్తి అవ్వడంతో గేమ్ ఛేంజర్ ని పరుగులు పెట్టిస్తున్నారు. కాగా ఇండియన్ 2ని జూన్ లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రిలీజ్ కి మరో నెల సమయం మాత్రమే ఉండడంతో.. మూవీ టీం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది.

ఈక్రమంలోనే మే మొదటి వారంలో సినిమా నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఆ తరువాత మే 16న గ్రాండ్ ఆడియో లాంచ్ ని నిర్వహించబోతున్నారట. ఇక ఈ ఈవెంట్ ని శంకర్ స్టైల్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. ఇండియన్ 2 ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కాబోతున్నారట. వీరితో పాటు మరికొంతమంది స్టార్స్ కూడా ఈ ఈవెంట్ లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ వార్త ప్రస్తుతం తెలుగు, తమిళ్ ఫిలిం వర్గాల్లో ట్రేండింగ్ టాపిక్ అయింది. ఇది విన్న చరణ్ అభిమానులు తెగ ఖుషి ఫీల్ అవుతున్నారు. ఇద్దరు లెజెండ్స్ (కమల్, రజిని) తో కలిసి రామ్ చరణ్ ఒకే స్టేజి పై ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు అనే విషయం మెగా ఫ్యాన్స్ ని ఫుల్ హ్యాపీ చేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ వార్త గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. చరణ్ ఫ్యాన్స్ అయితే.. ఇది నిజమైతే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. మరి శంకర్ ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి.

Also read : Aamir Khan : ‘పఠాన్’ సినిమాలో మా అక్క నటించింది మీకు తెలుసా.. ఆమిర్ ఖాన్