Site icon HashtagU Telugu

Ram Charan Peddi : చరణ్ పెద్దిలో ఆయన ఉన్నాడంటే మాత్రం.. మెగా ఫ్యాన్స్ రచ్చ కన్ఫర్మ్..!

Ram Charan Peddi Megastar Chiranjeevi Cameo Role

Ram Charan Peddi Megastar Chiranjeevi Cameo Role

గ్లోబల్ స్టార్ రాం చరణ్ (Global Star Ram Charan) గేమ్ చేంజర్ తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా ప్లాన్ చేస్తుంది. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో చరణ్ కి జోడీగా జాన్వి కపూర్ నటిస్తుంది. పెద్ది టిటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చరణ్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి (Chirajeevi) కూడా ఉంటాడని టాక్. బుచ్చి బాబు సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యామియో రోల్ లో చిరంజీవిని ఊహించుకున్నాడట. చిరు కూడా దాదాపు ఓకే అన్నట్టే అని తెలుస్తుంది. చరణ్ పెద్ది సినిమాలో చిరంజీవి ఉంటే మాత్రం మెగా ఫ్యాన్స్ కు మెగా ట్రీట్ దక్కినట్టే లెక్క. ఆల్రెడీ చిరంజీవి, చరణ్ ఇద్దరు కలిసి ఆచార్య సినిమాలో నటించారు.

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇస్తూ డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. ఐతే బుచ్చి బాబు (Bucchi Babu) మాత్రం చిరు చేసే రోల్ ని ఒక రేంజ్ ఎలివేషన్ తో ప్లాన్ చేస్తున్నాడట. చరణ్ సినిమాకు పెద్ది (Peddi) టైటిల్ బాగుంది కానీ అన్ని భాషల్లో ఈ టైటిల్ అంటే వర్క్ అవుట్ అవుతుందాకాదా అని ఆలోచిస్తున్నారట.

కచ్చితంగా గ్లోబల్ స్టార్ చరణ్ ఇమేజ్ కి తగినట్టుగానే ఈ సినిమా వీర లెవల్ లో ఉంటుందని చెబుతున్నారు. సినిమా ప్రస్తుతం ప్రీ ప్ర్డక్షన్ వర్క్ జరుపుకుంటుండగా త్వరలోనే ఆర్సీ 16 సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని ఫైన చేశారని తెలిసిందే.

Also Read : Pragya Jaiswal : ప్రగ్యా ఈ మెరుపులకు ఏమి తక్కువలేదు.. కానీ..!