ఈసారి G20 సదస్సులు మన ఇండియా(India)లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా G20 సదస్సు జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్(Srinagar) లో నిర్వహిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. జమ్మూకశ్మీర్(Jammu Kashmir) కు రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత, ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జరిగే మొదటి అంతర్జాతీయ సదస్సు కావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ G20 సదస్సుకు సభ్య దేశాల నుంచి దాదాపు 60 మంది ప్రతినిధులు రానున్నారు. ఈ సదస్సులో ముఖ్యంగా ఫిలిం టూరిజం, సినిమా అభివృద్ధి, దేశాల మధ్య ఫిలిం పాలసీల గురించి చర్చలు జరగనున్నాయి. ఈ G20 సదస్సులో ఫిలిం టూరిజం ఆర్ధికాభివృద్ధి, సాంసృతిక పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్యానల్ లో 17 దేశాల నుంచి ప్రతినిధులు మెంబర్స్ గా ఉండగా మన దేశం నుంచి రామ్ చరణ్ ఉండటం విశేషం.
ఈ ప్యానల్ నిర్వహించే సమావేశాల్లో చరణ్ ఇండియన్ సినిమాతో పాటు, కశ్మీర్ గురించి మాట్లాడనున్నారు. ప్రపంచం ముందు ఫిలిం టూరిజంలో భాగంగా కశ్మీర్ ని ప్రమోట్ చేయబోతున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి చరణ్ శ్రీనగర్ వెళ్లారు. నేడు మధ్యాహ్నం జరిగిన ఓ సదస్సులో చరణ్ పాల్గొని కశ్మీర్ గురించి, కశ్మీర్ లో జరిగిన సినిమా షూటింగ్స్ గురించి, తనకు కశ్మీర్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు.
#WATCH | We love Kashmir. it is such a beautiful place. It is the best place they chose to have the G20 meeting: Actor Ram Charan in J&K's Srinagar for the third G20 Tourism Working Group pic.twitter.com/HAZcBBcZoM
— ANI (@ANI) May 22, 2023
మరో మూడు రోజులు రామ్ చరణ్ శ్రీనగర్ లోనే ఉండి G20 సదస్సు సమావేశాల్లో పాల్గొననున్నారు. దీంతో చరణ్ అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. పలువురు ప్రముఖులు చరణ్ ని అభినందిస్తున్నారు.
Also Read : Keerthy Suresh: సరైన సమయంలో నా మిస్టరీ మ్యాన్ ను పరిచయం చేస్తా: పెళ్లిపై కీర్తి సురేశ్ రియాక్షన్!