Orange : రామ్‌‌చరణ్‌ ‘ఆరెంజ్‌’ మూవీ టైటిల్‌ వెనుక ఉన్న కథేంటో తెలుసా..?

యూత్ ఫుల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాకి ఆరెంజ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే ప్రశ్న చాలామందిలో కలిగింది. దీని గురించి దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

  • Written By:
  • Publish Date - June 24, 2023 / 07:40 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. మగధీర(Magadheera) వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత చేసిన సినిమా ‘ఆరెంజ్'(Orange). బొమ్మరిల్లు, పరుగు సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న భాస్కర్(Bhaskar) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. హీరో అండ్ డైరెక్టర్ హిట్ ట్రాక్ ఉండడం, క్రేజీ కాంబినేషన్ కావడం, మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవ్వడం, టైటిల్ కూడా ఆరెంజ్ అని పెట్టడంతో మూవీ ఓ రేంజ్ ఉంటుందని ఆడియన్స్ ఎన్నో అంచనాలతో థియేటర్ కి వెళ్లారు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం భారీ పరాజయాన్ని ఎదురుకుంది.

సినిమాలోని చాలా భాగం ఆస్ట్రేలియాలోనే చిత్రీకరణ జరుపుకోవడంతో మూవీ బడ్జెట్ భారీగానే ఖర్చు అయ్యింది. నిర్మాతగా వ్యవహరించిన నాగబాబుకి అప్పటిలో భారీ నష్టాన్ని కలుగజేసింది. అయితే యూత్ ఫుల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాకి ఆరెంజ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే ప్రశ్న చాలామందిలో కలిగింది. దీని గురించి దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

ప్రేమ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. లవ్ లో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయనేది డైరెక్టర్ నమ్మకం. ఈ హెచ్చు తగ్గులను సూర్యోదయం, సూర్యాస్తమయంతో దర్శకుడు పోల్చాడట. ఇక ఈ రెండు సమయాల్లో సూర్యుడు ఆరెంజ్‌ కలర్ లోనే మనకి కనిపిస్తాడు. ప్రేమని సూర్యుడితో, హెచ్చు తగ్గులను సన్ రైజ్ అండ్ సన్ సెట్ తో పోల్చి ఆరెంజ్ అనే టైటిల్ ని అనుకున్నట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు.

అప్పటిలో ఈ సినిమా చూసిన కొందరు సినీ ప్రముఖులు.. ఈ మూవీ 10 ఏళ్ళ తరువాత వస్తే హిట్ అయ్యేదని చెబుతుంటే దర్శకుడికి అర్ధం కాలేదట. అయితే ఇటీవల ఈ సినిమాని రీ రిలీజ్ చేయగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటి జనరేషన్ యూత్ కి ఈ సినిమా బాగా నచ్చేసింది.

 

 

Also Read : RGV Vyuham Teaser : చంద్ర‌బాబు టార్గెట్ గా ఆర్జీవీ `వ్యూహం` టీజ‌ర్