Site icon HashtagU Telugu

Ram Charan : తల్లితో కలిసి పిఠాపురంకి రామ్ చరణ్.. పవన్ ప్రచారం కోసమేనా..?

Ram Charan Off To Pithapuram Tomorrow With His Mother Surekha

Ram Charan Off To Pithapuram Tomorrow With His Mother Surekha

Ram Charan : జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం.. ప్రస్తుతం నేషనల్ వైడ్ టాక్ ఆఫ్ ది టాపిక్ అవుతుంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలవలేక పవన్ కళ్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచేందుకు పిఠాపురం నియోజికవర్గాన్ని ఎన్నుకున్నారు. అధికారం లేకున్నా ఇన్నాళ్లు తమ కోసం పోరాడిన పవన్ కోసం.. పిఠాపురంలో తన అభిమానులు, జనసైనుకులతో పాటు సెలబ్రిటీస్ సైతం ప్రచారం చేస్తూ సందడి చేస్తున్నారు.

దీంతో ఏపీ ఎన్నికల్లో పిఠాపురం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. కాగా పవన్ కోసం ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు మరియు ఆయన సతీమణి పద్మజ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రచారం చేసారు. చిరంజీవి కూడా పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తారని వార్తలు వినిపించినా.. నేడు వాటిని చిరంజీవి కొట్టిపారేశారు. తాను పిఠాపురం రావడం లేదని, అందుకే ఒక వీడియో బైట్ ద్వారా పవన్ కి తన మద్దతు తెలిపినట్లు చిరంజీవి వెల్లడించారు.

కాగా పవన్ కోసం రామ్ చరణ్ కూడా పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తారని టాక్ వినిపించింది. కానీ దాని పై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. రేపు (మే 11) రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం కుక్కుటేశ్వర ఆలయాన్ని సందర్శించుకోనున్నారట. అయితే ఇది కేవలం ఆలయ సందర్శనేనా..? లేక బాబాయ్ కోసం అబ్బాయి ప్రచారమా..? అనే సందేహాలు వస్తున్నాయి.

కాగా రామ్ చరణ్ రేపు పిఠాపురం వస్తున్నారని తెలియడంతో.. మెగా అభిమానుల్లో, జనసైనికుల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తుంది. మరి రేపు రామ్ చరణ్ పిఠాపురం వచ్చి ఏ మాట్లాడతారో చూడాలి.