మన సెలబ్రిటీలు సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉంటూనే డబ్బులు కూడా బాగా సంపాదిస్తారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) RRR సినిమా తర్వాత నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పలు పెద్ద పెద్ద బ్రాండ్స్ కి కూడా యాడ్స్ చేస్తున్నాడు.
చరణ్ ఇప్పటికే పలు వస్తువులకు, కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్స్(Ads) చేయగా తాజాగా మరో కంపెనీకి యాడ్ చేశారు. వివాహాల బట్టలకు స్పెషల్ అయిన మాన్యవర్ సంస్థ యాడ్ ని చరణ్ చేశారు. కొత్త యాడ్ లో.. లైఫ్ లో అన్నీ తన నాన్న దగ్గర నేర్చుకున్నాను అని, ఆయన మనల్ని బాగా చూసుకుంటారు కాబట్టి ఆయన గురించి కూడా మనం ఆలోచించాలని చెప్తూ మాన్యవర్ దుస్తుల్ని ప్రమోట్ చేశారు.
గతంలో మాన్యవర్ కి బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ యాడ్స్ చేసేవాడు. ఇప్పుడు చరణ్ చేయడంతో ఈ కొత్త యాడ్స్ చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. మీరు కూడా చరణ్ కొత్త యాడ్ చూసేయండి.
Also Read : Pavala Shyamala : ఒకప్పటి స్టార్ లేడీ కమెడియన్.. ఇప్పుడు తినడానికి కూడా డబ్బులు లేక వృద్దాశ్రమంలో..