Ram Charan ప్రపంచవ్యాప్తంగా RRR చేసిన హంగామా తెలిసిందే. ఆస్కార్ అవార్డుల్లో నాటు నాటు సాంగ్ కి అవార్డు రావడంతో వరల్డ్ సినీ లవర్స్ అంతా కూడా ఆర్.ఆర్.ఆర్ మేనియాలో మునిగితేలారు. ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ అందులో నటించిన ఎన్.టి.ఆర్, రాం చరణ్ లకు గ్లోబల్ లెవెల్ లో క్రేజ్ వచ్చింది. ఇప్పటికే మన వాళ్ల పేర్లు ఇంటర్నేషనల్ లెవెల్ లో అదరగొడుతుండగా రాబోయే సినిమాలతో మరింత సత్తా చాటనున్నారని చెప్పొచ్చు.
ఇక లేటెస్ట్ గా భారత్ లో జరిగిన జర్మన్ యూనిటీ డే (German Unity Day) వేడుకల్లో RRR యూనిట్ సందడి చేసింది. జర్మనీ ఎంబసీ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి (Keeravani) అటెండ్ అయ్యారు. అయితే ఈ ప్రోగ్రాం కు రాం చరణ్ కి కూడా ఆహ్వానం అందింది. కానీ ఫ్యామిలీతో చరణ్ ఇటలీ వెళ్లడంతో ఈ కార్యక్రమానికి అందుకోలేదు.
Also Read : Samantha : సమంతకు హ్యాండ్ ఇచ్చిన క్లోజ్ ఫ్రెండ్స్..!
ఈ ప్రోగ్రాం లో పాల్గొనకపోవడంతో రాం చరణ్ (Ram Charan) జర్మనీ ఎంబసీ సిబ్బందికి వీడియో కాల్ తో సర్ ప్రైజ్ చేశారు. జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్ కు అటెండ్ అవలేకపోయినందుకు తన క్షమాపణలు చెప్పాడు. ఈ సందర్భంగా చరణ్ వేడుకల్లో ప్రదర్శించిన నాటు నాటు సాంగ్ కటౌట్ తనకు ఎంతగానో నచ్చిందని అన్నారు. టైం చూసుకుని అందరిని కలుస్తానని అన్నారు చరణ్.
ఇక చరణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే శంకర్ డైరెక్షన్ లో గేం చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో ఒక సినిమా లైన్ లో ఉంది.
