Ram Charan : మొన్న ఎన్టీఆర్ నేడు రామ్ చరణ్.. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో తెలుగు స్టార్స్..!

Ram Charan ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా సభ్యత్వం పొందారు. RRR సినిమాలో రామరాజు పాత్రలు ప్రేక్షకులను మెప్పించిన చరణ్

Published By: HashtagU Telugu Desk
Ram Charan Peddi Megastar Chiranjeevi Cameo Role

Ram Charan Peddi Megastar Chiranjeevi Cameo Role

Ram Charan ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా సభ్యత్వం పొందారు. RRR సినిమాలో రామరాజు పాత్రలు ప్రేక్షకులను మెప్పించిన చరణ్ ఆ సినిమాతో గ్లోబల్ లెవెల్ లో ప్రశంసలు అందుకున్నాడు. ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డ్ రాగా ఎన్నో అవార్డులు రివార్డులు కూడా వచ్చాయి.

లేటెస్ట్ గా ఆస్కార్ బ్రాంచ్ (Oscar Actors Branch) లో చరణ్ సభ్యత్వం కన్ఫర్మ్ చేస్తూ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ వారు యాక్టర్స్ బ్రాంచ్ లో మరికొంతమందికి సభ్యత్వం ప్రకటించారు. ఇప్పటికే ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో ఎన్టీఆర్ సభ్యత్వం అందుకున్నాడు. RRR సినిమాలో కొమరం భీమ్ పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన తారక్ అకాడమీ అవార్డ్ వారిని కూడా ఆకట్టుకున్నాడు.

Also Read : Dunki Teaser: షారుక్ ఖాన్ డుంకీ టీజర్ రిలీజ్, ఫన్ అండ్ ఎమోషన్ డ్రామా

అందుకే ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో ఎన్టీఆర్ కి మెంబర్స్ షిప్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ (NTR) తర్వాత చరణ్ కూడా ఆ లిస్ట్ లో చేరాడు. ఎంతో అంకితభావంతో ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించిన ఈ నటులు ఎన్నో సినిమాల్లో వారి పాత్రలకు ప్రాణం పోశారు. వారి నటనతో ప్రేక్షకులకు అసాధారణమైన అనుభూతి అందిస్తున్నారని అకాడమీ సోషల్ మీడియాలో పొస్ట్ షేర్ చేసింది.

చరణ్ ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ మెంబర్ షిప్ లిస్ట్ లో ఉండటం మెగా ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ అందిస్తుంది. ప్రస్తుతం రాం చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 02 Nov 2023, 12:34 PM IST