Game Changer : ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ అప్డేట్.. రాజమండ్రిలో వారం షెడ్యూల్..

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్ అప్డేట్. ప్రధాన పాత్రలతో రాజమండ్రిలో వారం షెడ్యూల్..

  • Written By:
  • Publish Date - June 2, 2024 / 12:05 PM IST

Game Changer : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం.. గత మూడేళ్ళుగా చిత్రకరణ జరుపుకుంటూనే ఉంది. అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని పై ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. క్రిందట నెలలో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసిన దర్శకుడు శంకర్.. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

ఇక ఇది గమనించిన చరణ్ అభిమానులు.. ఇండియన్ 2 రిలీజ్ అయ్యే వరకు గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలవ్వదేమో అని భయపడుతున్నారు. అయితే అలా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ నెలలోనే గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలు కానుంది. రాజమండ్రిలో ఈ షెడ్యూల్ జరగనుంది. జూన్ 7 లేదా 9న ఈ షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుంది. దాదాపు వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. మూవీలోని పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నారు.

రామ్ చరణ్ తో పాటు మూవీలో పలు కీలక పాత్రలు చేస్తున్న నటీనటులు కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనున్నారు. కాగా ఈ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని నిర్మాత దిల్ రాజు కుమార్తె ఇటీవల తెలియజేసారు. అక్టోబర్ లో ఎన్టీఆర్ దేవర కూడా రిలీజ్ అవుతుంది. ఒకవేళ గేమ్ ఛేంజర్ కూడా అప్పుడే రిలీజ్ అయితే.. చరణ్, ఎన్టీఆర్ మధ్య పోటీ తప్పదు.

ఆర్ఆర్ఆర్ తరువాత వీరిద్దరూ చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్స్.. ఈ రెండు సినిమాలు కావడం గమనార్హం. ఒకవేళ వీరిద్దరి పోటీ నిజమైతే.. దానిని చూడడానికి కూడా టాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.