Site icon HashtagU Telugu

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఇంకెన్ని రోజులు ఉందో తెలుసా..?

Ram Charan Kiara Advani Game Changer Movie Shooting Details

Ram Charan Kiara Advani Game Changer Movie Shooting Details

Game Changer : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ని కూడా శంకర్ తెరకెక్కిస్తుండడంతో.. గేమ్ ఛేంజర్ షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. అయితే ఇండియన్ 2 షూటింగ్ ఇటీవలే పూర్తి అవ్వడంతో.. గేమ్ ఛేంజర్ షూటింగ్ లో కొంచెం వేగం పెరిగింది.

మొన్నటి వరకు షెడ్యూల్ తరువాత షెడ్యూల్ ని కంప్లీట్ చేస్తూ వచ్చారు. అయితే హైదరాబాద్ షెడ్యూల్ తరువాత కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఇండియన్ 2 ప్రమోషన్స్ లో పాల్గొనడానికి శంకర్ వెళ్లడంతో.. గేమ్ ఛేంజర్ కి బ్రేక్ పడింది. నెక్స్ట్ షెడ్యూల్ జూన్ 7 లేదా 9న స్టార్ట్ అవ్వనుందట. దాదాపు వారం రోజుల పాటు రాజమండ్రిలో ఈ షెడ్యూల్ జరగనుంది. అయితే మూడేళ్ళ నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉన్న ఈ చిత్రం.. ఎంతవరకు పూర్తి అయ్యింది అనేది క్లారిటీ లేదు. అసలు ఈ సినిమా ఇంకెన్ని రోజులు షూటింగ్ జరుపుకోవాలి.

మరో ముపై రోజులు ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటే.. మొత్తం చిత్రీకరణ పూర్తి అయ్యినట్లే అంట. ఇక ఈ ముపై రోజుల్లో రామ్ చరణ్ కేవలం పది రోజులు షూటింగ్ లో పాల్గొంటే సరిపోతుందట. ఇక వచ్చే వారం మొదలుకాబోయే రాజమండ్రి షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొనున్నారు. అలాగే మూవీలో పలు కీలక పాత్రలు చేస్తున్న ముఖ్య నటీనటులు కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనున్నారట. కాగా ఈ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని నిర్మాత దిల్ రాజు కుమార్తె ఇటీవల తెలియజేసారు.