Site icon HashtagU Telugu

EXCLUSIVE: ప్రమోషన్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ ఏమాత్రం తగ్గేదే..లే!

Ram Charan Alia Bhatt Jr Ntr S S Rajamouli Rrr

Ram Charan Alia Bhatt Jr Ntr S S Rajamouli Rrr

SS రాజమౌళి నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక మూవీ RRR ప్రమోషన్ల పరంగా మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. జనవరిలో భారీ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతున్నందున, RRR బృందం తమ ప్రచార వ్యూహాన్ని పెంచాలని నిర్ణయించుకుంది. RRR నిర్మాతలు డిసెంబర్ 19న ముంబైలో అతిపెద్ద ప్రమోషనల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారని సమాచారం.

తన దర్శకత్వ మాయాజాలంతో మెస్మరైజ్ చేసే జక్కన.. ప్రమోషన్లలోనూ ఏ మాత్రం తగ్గడం లేదు. పరిశ్రమలోని పెద్దలతో పాటు మొత్తం తారాగణం, యూనిట్ అంతా సందడి చేసేలా ప్లాన్ చేయనున్నారు. ఓ సాధారణ సినిమాకు బడ్జెట్ ఎంత ఉంటుందో, ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ అంతే స్థాయిలో ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ముంబై బాట పట్టబోతున్నారు.

అయితే నటీనటులంతా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ పాసులను ఎక్కువగా తీసుకున్నారట. ప్రధాన నటీనటులు కూడా ప్రేక్షకుల కోసం ప్రదర్శనలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం ఖాయం. S.S రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ కీలక పాత్రల్లో కనిపించనుండగా, సముద్రఖని, రే స్టీవెన్‌సన్ మరియు అలిసన్ డూడీ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.

జయంతిలాల్ గదా (PEN) ఉత్తర భారతదేశం అంతటా థియేట్రికల్ పంపిణీ హక్కులను పొందారు. అన్ని భాషల కోసం హక్కులను కూడా కొనుగోలు చేశారు. పెన్ మరుధర్ నార్త్ టెరిటరీలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని నిర్మించారు. ‘RRR’ జనవరి 7, 2022న విడుదలవుతోంది.