హీరోలు, హీరోయిన్లను పెళ్లి చేసుకోవడం సాధారణం..
ఇలా పెళ్లి చేసుకున్న నటులు ఎంతోమంది వైవాహిక జీవితంలో
సక్సెస్ అయ్యారు. కొందరు మాత్రం త్వరగా విడాకులు తీసుకున్నారు. విడిపోయారు.
ఇంకొందరు ప్రముఖ హీరోలు మాత్రం పూర్తి డిఫరెంట్ గా ఆలోచించారు. సినీ రంగంతో ఏ మాత్రం సంబంధం లేని అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ హీరోలు పెళ్లి చేసుకున్న అమ్మాయిలంతా బడా బిజినెస్ మెన్ల కూతుళ్ళే కావడం విశేషం. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం..
* రాంచరణ్ – ఉపాసన
హీరో రాంచరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఆయన చిరంజీవి కుమారుడు. రాంచరణ్ భార్య పేరు ఉపాసన. 2012 లో వీళ్ళ మ్యారేజ్ అయింది.ఉపాసన
తండ్రి పేరు అనిల్ కామినేని. KEI Group అనే వ్యాపార సంస్థ ఆయనదే. ఆమె తాత ప్రతాప్ సి.రెడ్డి అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ను స్థాపించారు.
* అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి
బన్నీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన అల్లు అరవింద్ కుమారుడు. అల్లు అర్జున్ భార్య పేరు స్నేహా రెడ్డి. 2011 లో వీళ్ళ మ్యారేజ్ జరిగింది. స్నేహా రెడ్డి తండ్రి పేరు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.
ఆయన ఒక వ్యాపారవేత్త. సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే ఇంజినీరింగ్ కాలేజ్ ఆయనదే.
* రానా దగ్గుబాటి – మిహీకా బజాజ్
హీరో రానా గురించి, దగ్గుబాటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రామానాయుడు మనవడు అని అందరికీ తెలుసు.
కొవిడ్ టైం లో ఆయన పెళ్లి చేసుకున్నారు. భార్య పేరు మిహీకా బజాజ్. ఆమె ఒక ఇంటీరియర్ డిజైనర్.Krsala jewels అనే కంపెనీలో డైరెక్టర్, క్రియేటివ్ హెడ్ గా మిహీకా వాళ్ళ అమ్మ సేవలు అందిస్తున్నారు.
* జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి
జూనియర్ ఎన్టీఆర్ పేరుని చూస్తే చాలు ఆయన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అర్థమైపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ భార్య పేరు లక్ష్మీ ప్రణతి. ఆమె తండ్రి నార్నే శ్రీనివాసరావు కూడా వ్యాపారవేత్త, ఒక మీడియా చానల్ సైతం నిర్వహిస్తున్నారు. లక్ష్మీ ప్రణతి వాళ్ళ అమ్మ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు కు మేన కోడలు.
* దుల్కర్ సల్మాన్ – అమల్ సూఫియా
హీరో మమ్ముట్టి కొడుకే దుల్కర్ సల్మాన్. ఈయన భార్య పేరు అమల్ సూఫియా. ఈమె తండ్రి కూడా చెన్నైలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త.
* తలపతి విజయ్ – సంగీత సోర్ణ లింగం
తలపతి విజయ్ హీరోయిజం అదుర్స్. దక్షిణాది లో ఎంతో క్రేజ్ సంపాదించారు. ఈయన భార్య పేరు సంగీత సోర్ణ లింగం. ఈమె తండ్రి శ్రీలంక లో ప్రముఖ వ్యాపారవేత్త.
