Ram Charan : హైదరాబాద్ శివారులో RC16 కోసం భారీ సెట్స్ నిర్మాణం..

హైదరాబాద్ శివారులో RC16 కోసం భారీ సెట్స్ నిర్మాణం. ఈ మూవీ రంగస్థలం తరహాలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో..

Published By: HashtagU Telugu Desk
Ram Charan Janhvi Kapoor Rc16 Movie Updates

Ram Charan Janhvi Kapoor Rc16 Movie Updates

Ram Charan : ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్.. ఆ తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంటే, శివ రాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.

వీరితో మరికొంతమంది స్టార్ నటీనటులు కూడా ఈ మూవీలో భాగం కాబోతున్నారు. రంగస్థలం సినిమా తరహాలోనే ఈ మూవీ కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో మట్టి కథతో రాబోతున్నట్లు రామ్ చరణ్ గతంలోనే చెప్పారు. ఇక ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్ కోసం.. మూవీ యూనిట్ భారీ సెట్స్ ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ శివారులో భారీ విలేజ్ సెట్ ని నిర్మించారు. జూన్ నుంచి ఈ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారట. పాటల చిత్రీకరణతో ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నా సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంగీత దర్శకుడు మూడు పాటల రికార్డింగ్ ని కూడా పూర్తీ చేసేసారు. ఆ సాంగ్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయని ఇండస్ట్రీలో గట్టి టాక్ వినిపిస్తుంది. మరి రెహమాన్ పాటలకు రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ ఎలాంటి స్టెప్పులు వేస్తారో చూడాలి. గతంలో వీరిద్దరి పేరెంట్స్ చిరంజీవి, శ్రీదేవి జంట.. అబ్బని తియ్యని దెబ్బ అంటూ ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసారు. మరి ఆ మ్యాజిక్ ని చరణ్ అండ్ జాన్వీ రీ క్రీస్తే చేస్తారో లేదో చూడాలి.

 

  Last Updated: 31 May 2024, 03:52 PM IST