Site icon HashtagU Telugu

Ram Charan : పాటలతో మొదలు కాబోతున్న RC16.. జాన్వీ పాపతో చరణ్..

Ram Charan Janhvi Kapoor Rc16 Movie Start With Songs Shooting

Ram Charan Janhvi Kapoor Rc16 Movie Start With Songs Shooting

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత రెండేళ్లుగా ‘గేమ్ ఛేంజర్’ సినిమాతోనే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఎండ్ కార్డు వేసే సమయం వచ్చింది. ఇక ఈ మూవీ తరువాత చరణ్.. బుచ్చిబాబుతో తన నెక్స్ట్ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ మూవీని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసారు. వృద్ధి మూవీస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు.

కాగా ఈ మూవీ షూటింగ్ జూన్ నుంచి మొదలు కాబోతుందట. ఇక ఈ షూటింగ్ ని పాటల చిత్రీకరణతో మొదలు పెట్టనున్నారట. రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ పై అందమైన సాంగ్ ని బుచ్చిబాబు ముందుగా చిత్రీకరించనున్నారట. మెగా అభిమానులు కూడా ఈ మూమెంట్ కోసమే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇందుకు కారణం చిరంజీవి, శ్రీదేవి జంట.. వెండితెర పై ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ జంట అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ‘అబ్బని తియ్యని’ సాంగ్. ఆ పాటలో చిరంజీవి, శ్రీదేవి కెమిస్ట్రీ ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తుంది.

అలా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసిన చిరు, శ్రీదేవి వారసులుగా వచ్చిన చరణ్, జాన్వీ ఇప్పుడు కలిసి నటిస్తుంటే.. అభిమానులందరిలో ఒకటే ఒక ఆశ ఎక్కువుగా కనిపిస్తుంది. స్క్రీన్ పై ఈ వారసుల జంట డాన్స్ వేస్తుంటే.. ఎలా ఉండబోతుందో అని. మరి అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న ఈ పాటలని బుచ్చిబాబు ఎలా డిజైన్ చేయబోతున్నారో చూడాలి. కాగా ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ మూడు పాటల రికార్డింగ్ కూడా పూర్తీ అయ్యిపోయింది. ఆ సాంగ్స్ అదిరిపోయాయని ఇండస్ట్రీలో గట్టి టాక్ వినిపిస్తుంది.