Ram Charan : రామ్ చరణ్ RC16 షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట..

రామ్ చరణ్, బుచ్చిబాబు RC16 షూటింగ్ కి ముహూర్తం సెట్ అయ్యిందట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసిన దర్శకుడు..

Published By: HashtagU Telugu Desk
Ram Charan Janhvi Kapoor Rc16 Movie Shooting Update

Ram Charan Janhvi Kapoor Rc16 Movie Shooting Update

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇన్నాళ్లు నత్త నడకన నడిచిన ఈ చిత్రం షూటింగ్ ని దర్శకుడు శంకర్ పరుగులు పెట్టిస్తున్నారు. ఒక షెడ్యూల్ పూర్తి అయిన తరువాత మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తూ.. షూటింగ్ పూర్తి చేసేలా పని చేస్తున్నారు. కాగా చరణ్ ఫ్యాన్స్ అంతా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి.. రామ్ చరణ్ ఎప్పుడు RC16 సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తారా అని వేచి చూస్తున్నారు.

నేషనల్ అవార్డు విన్నర్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమా పై రామ్ చరణ్ గతంలో చేసిన కాన్ఫిడెంట్ కామెంట్స్.. ఫ్యాన్స్ లో ఈ చిత్రం పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీలో శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్ తో పాటు మరికొంతమంది స్టార్స్ కూడా కనిపించబోతున్నారని తెలియడంతో.. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అభిమానులు క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ షూటింగ్ అప్డేట్ పై టాలీవుడ్ ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది. గేమ్ ఛేంజర్ షూటింగ్ జూన్ ఫస్ట్ లేదా ఎండింగ్ కి పూర్తి అవుతుందట. అది పూర్తి కాగానే RC16ని వెంటనే స్టార్ట్ చేయనున్నారట. అంటే జూన్ లేదా జులై నుండి RC16 రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. బుచ్చిబాబు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకొని, పక్కా ప్లానింగ్ తో రామ్ చరణ్ కోసం ఎదురు చూస్తున్నారట.

కాగా ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూడు సాంగ్స్ కంపొజిషన్ పూర్తి అయ్యిందట. మూడు సాంగ్స్ సూపర్ గా ఉంటాయంటూ ఫీడ్ బ్యాక్ వినిపిస్తుంది.

Also read : Ranveer Singh : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రణ్‌వీర్ విలన్.. ‘బ్రహ్మరాక్షస’ సినిమా టైటిల్..!

  Last Updated: 29 Apr 2024, 03:07 PM IST