Site icon HashtagU Telugu

RC 16 Pooja Ceremony: మొదలైన రామ్ చరణ్ కొత్త మూవీ పనులు.. వీడియోస్ వైరల్?

Mixcollage 20 Mar 2024 03 36 Pm 6369

Mixcollage 20 Mar 2024 03 36 Pm 6369

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇకపోతే రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. rc16 వర్కింగ్ టైటిల్ తో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా ఈ సినిమా తెరకెక్కనుంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమాని నిర్మించబోతున్నారు.

కాగా తాజాగా నేడు RC16 సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు మూవీ మేకర్స్. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, ఉపాసనతో పాటు వచ్చాడు. అలాగే ఈ జాన్వీ కపూర్ కూడా హాజరైంది. సుకుమార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు, మూవీ యూనిట్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక చరణ్ పక్కన జాన్వీ కపూర్ కనపడటంతో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అధికారికంగా ఈ కార్యక్రమం లైవ్ ఇవ్వలేదు. ఫోటోలు కూడా ఇంకా రిలీజ్ చేయకపోయినా అభిమానుల దగ్గర్నుంచి వీడియోలు లీక్ అవుతున్నాయి. జగదేకవీరుడు కొడుకు, అతిలోక సుందరి కూతుర్ని పక్కపక్కనే చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని భారీగా నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి ఏ ఆర్ రహమాన్ సంగీతం ఇవ్వనున్నారు. ఈ సినిమాకి టైటిల్ ఇంకా ప్రకటించకపోయినా పెద్ది అనే టైటిల్ పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ RC16 ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. పూజా కార్యక్రమాలు అయినా గేమ్ ఛేంజర్ షూట్ మొత్తం పూర్తయ్యాకే RC16 షూట్ మొదలుపెడతారని బుచ్చిబాబు గతంలో తెలిపారు.