Site icon HashtagU Telugu

Prabhas & Ram Charan: రామ్ చరణ్ నా స్నేహితుడు, అతనితో కలిసి కచ్చితంగా సినిమా చేస్తా : ప్రభాస్

Prabha And Ram Charan

Prabha And Ram Charan

Prabhas & Ram Charan: వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు టాలీవుడ్ రెబల్  స్టార్ ప్రభాస్. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్ K 2898 AD టీజర్ విడుదలైంది. అభిమానులలో ఉత్సాహాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లారు. ఈవెంట్ నుండి చిత్రాలు, వీడియోలతో పాటు టీజర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ప్రభాస్ కు సంబంధించిన క్లిప్ ఒకటి అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో నటుడు రామ్ చరణ్‌తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడారు. టీజర్ లాంచ్‌లో మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా మీరు ఎప్పుడైనా రామ్ చరణ్‌తో కలిసి నటిస్తారా అని ప్రభాస్‌ను అడిగారు. దానికి అతను ఇలా అన్నాడు. ” రామ్ చరణ్ నా స్నేహితుడు, కచ్చితంగా అతనితో కలిసి సినిమా చేస్తా. కాకపోతే కొంచెం టైం పడుతుంది’’ అని అన్నాడు. భారతదేశ గొప్ప డైరెక్టర్స్ లో రాజమౌళి ఒకరు అని, ఆర్ఆర్ఆర్ సినిమా అందరినీ ఆకట్టుకుందనీ, ఆ మూవీకి ఆస్కార్ రావడం గొప్ప కారణమని ప్రభాస్ అన్నారు. ప్రస్తుతం ప్రభాస్ కామెంట్స్ అటు రామ్ చరణ్, ఇటు ప్రభాస్ అభిమానుల్లో ఆనందం నింపింది.

(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో గ్రాండ్ గా దాదాపు 500 కోట్లతో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె (Project K). ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని.. ఇలా అనేకమంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. హాలీవుడ్ లో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్ (Comic Con Event) లో ప్రాజెక్ట్ కె (Project K) చిత్రయూనిట్ పాల్గొంది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K చరిత్ర సృష్టించింది.