Site icon HashtagU Telugu

Ram Charan-Upasana: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి రామ్ చరణ్, ఉపాసనకు ఆహ్వానం

Upasana gave birth to a baby girl today morning in Apollo hospital Hyderabad

Upasana gave birth to a baby girl today morning in Apollo hospital Hyderabad

Ram Charan-Upasana: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం ఆయోధ్య వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22న మందిరంలోని రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుండటమే అందుకు కారణం. లక్షకు పైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనలకు ఆహ్వానం అందింది. ఆరెస్సెస్ నేత సునీల్ అంబేద్కర్ హైదరాబాద్ లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఇప్పటికే పవన్, చిరంజీవిలు సైతం ఆహ్వానం అందుకున్నారు.

ఈ కార్యక్రమానికి మొత్తం 8 వేల మంది ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.  రామాలయం కాంప్లెక్స్ ను 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఆలయంలోని ప్రతి ఫ్లోర్ 20 అడుగుల ఎత్తు ఉంటుంది.  ఈ వేడుకకు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, సాధువులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఆహ్వానాలను అందుకున్న సెలబ్రిటీలలో రజనీకాంత్, అజయ్ దేవగణ్, కంగనా రనౌత్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, అలియా భట్, రణబీర్ కపూర్ ఉన్నారు.

కాగా హనుమాన్ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సమయంలో చిత్ర యూనిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమ్ముడుపోయే ప్రతి టికెట్‌లో 5 రూపాయలను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని ప్రకటించింది. నిన్న ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.14.25 లక్షలను ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడికి విరాళంగా ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ప్రదర్శితమైనన్ని రోజులు కూడా అమ్ముడుపోయే ప్రతి టికెట్‌పై రూ.5ను విరాళంగా ఇవ్వనుంది.

Also Read: Revanth Reddy: రాహుల్‌ కోసం రేవంత్, ‘న్యాయ్‌ యాత్ర’కు సీఎం సిద్ధం!