Ram Charan : పాపం చరణ్..ఎంత కష్టపడ్డాడో..నీ ఓపికకు దండం సామీ..!!

ఒక్కసారిగా చరణ్ ను చూసి అభిమానులు చుట్టు ముట్టడం, లాగడం, ఒత్తడం, షర్ట్ పట్టి లాగడం వంటివి ఎన్నో చేసారు

Published By: HashtagU Telugu Desk
Charan Pitapuram2

Charan Pitapuram2

సినీ కళాకారులకు ఓ వరం ఉంది..అదే అభిమానం. అభిమానం అనే వరం వల్ల..వారు ఎక్కడికెళ్లినా వేలాది అభిమానులు తమను చూసేందుకు పోటీపడుతుంటారు. ఏ చిన్న పల్లెకు వెళ్లిన..ఎంత పెద్ద సిటీ కి సరే వారిని చూసేందుకు పోటీ పడతారు. అలాంటిది గ్లోబల్ స్టార్ ప్రజల్లోకి వస్తే ఇక ఏమన్నా ఉందా..? ఒక్కసారైనా చూడాలని..ఆయనతో సెల్ఫీ దిగాలని , ఆయన్ను ముట్టుకోవాలని ఇలా అభిమానులు ఎన్నో అనుకుంటారు. ఈరోజు పిఠాపురంలో అదే చేసారు. రామ్ చరణ్ ను ఉక్కిరిబిక్కిరి చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్న సందర్బంగా ఒక్కసారి ఆయన్ను కలిసి..అక్కడి వాతావరణం చూడాలని అనుకున్నాడు. అలాగే పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భావించాడు. శనివారం ఉదయం హైదరాబాద్ నుండి నేరుగా రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న చరణ్..రాజమండ్రి నుండి రోడ్డు మార్గాన పిఠాపురానికి చేరుకున్నారు. పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి వారిని చరణ్ దర్శించుకోనున్నారు. అనంతరం చేబ్రోలులోని పవన్ నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన్ను చూసేందుకు వేలాది మంది అభిమానులు వచ్చారు.

ఒక్కసారిగా చరణ్ ను చూసి అభిమానులు చుట్టు ముట్టడం, లాగడం, ఒత్తడం, షర్ట్ పట్టి లాగడం వంటివి ఎన్నో చేసారు. ఇలా అభిమానులు ఎంతగా హద్దులు దాటినా సరే రామ్ చరణ్ మాత్రం ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా..జరగండి ..జరగండి అంటూ ముందుకు వెళ్లారు తప్ప కోపం అనేది తెచ్చుకోలే. రామ్ చరణ్ ఓపిక చూసి అబ్బా..ఏంటి సామీ ఎక్కడి నుండి వచ్చింది అంత ఓపిక నీకు అంటూ వీడియోలు చూసిన వారు కామెంట్స్ చేయడం..ప్రశ్నించడం చేస్తున్నారు. మరికొంతమంది అభిమానులైతే అయ్యో చరణ్ కు ఎంత కష్టమొచ్చే అని ఎమోషనల్ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో వైరల్ అవుతుంది.

Read Also : AP : దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకునే వ్యక్తి మనకు అవసరమా..? – పవన్

  Last Updated: 12 May 2024, 03:56 PM IST