Site icon HashtagU Telugu

Ram Charan : పౌరాణిక పాత్రలో ‘రామ్ చరణ్’ ..?

'ram Charan' In A Mythologi

'ram Charan' In A Mythologi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) ప్రస్తుతం ‘RC 16’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల చరణ్ ముంబయిలో ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్నారు. ఈ సమయంలోనే అతని కొత్త సినిమాకు సంబంధించిన ఓ రూమర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. త్వరలో చరణ్ ఓ భారీ పౌరాణిక చిత్రంలో నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ‘కిల్’ మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్, తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పౌరాణిక ఇతిహాసాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారట. ఈ చిత్రానికి రామ్ చరణ్‌ను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది.

Liquor Door Delivery: ఏపీలో ఇంటివద్దకే మద్యం

గత ఆరు నెలలుగా రామ్ చరణ్, నిఖిల్ ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రంపై చర్చిస్తున్నారని వినికిడి. భారతీయ పురాణాలలోని అత్యంత కీలకమైన పాత్రల ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. మేకర్స్ ఇప్పటికే ప్రీ-విజువలైజేషన్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ టీమ్ కూడా ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ సినిమా గురించి రామ్ చరణ్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట. మరి చరణ్ ఏ నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తి గా ఉంది. నిజంగా చరణ్ ఈ మూవీ చేస్తాడా..? చేస్తే ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారా..? అనేది చూడాలి. రీసెంట్ గా చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది.