Ram Charan Vs Shah Rukh : అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు తళుక్కుమన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఈవెంట్‌లో మన తెలుగు స్టార్ రాంచరణ్‌ను అవమానించారనే ప్రచారం జరుగుతోంది. ప్రీవెడ్డింగ్ వేడుకలో స్టేజీపై రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమిర్ ఖాన్ కలిసి నాటునాటు పాటకు స్టెప్పులేశారు. అయితే దీనికి ముందు జరిగిన ఓ ఘటనను తాజాగా ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఓ సౌత్ స్టార్‌ని అలా పిలవడం నచ్చలేదని ఆమె పేర్కొన్నారు.
https://twitter.com/iRavenousX/status/1764203420435792094?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1764203420435792094%7Ctwgr%5Ef6e55399cdf6f767f025b8ad47ad5875d390f5ca%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fcinema%2Fshah-rukh-khan-disrespectful-comments-on-ram-charan-at-anant-ambani-and-radhika-pre-wedding-event-149010
We’re now on WhatsApp. Click to Join
అసలేం జరిగిందంటే.. స్టేజ్‌పై అంబానీ కుటుంబంతో పాటు షారుక్, సల్మాన్, అమీర్‌లు కలిసి నాటునాటు పాటకు డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో రామ్ చరణ్ కూడా అక్కడే ఉన్న విషయాన్ని నీతా అంబానీ గుర్తు చేశారు. దీంతో వెంటనే షారుక్ ఖాన్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ ఎక్కడా? అని అరిచారు. తమిళ భాషలో మాట్లాడుతూ.. ఇడ్లీ, వడా సాంబార్ తినేసి కూర్చున్నావా? రాంచరణ్ ఎక్కడున్నావ్? అని షారుఖ్ ఖాన్ పిలిచారు. ఆ వెంటనే రాంచరణ్ స్టేజీపైకి వచ్చారు. ముగ్గురు ఖాన్‌లతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు. గ్లోబల్ స్టార్ అయిన రాంచరణ్‌ను ఇడ్లీ, సాంబార్ అని పిలవడం ఏమాత్రం బాగా లేదని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. టాలీవుడ్‌పై ఉన్న అక్కసును షారుక్ ఇలా బయటపెట్టారని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ ప్రస్తావించారు.
Also Read :Vijaya Ekadashi : ఇవాళ విజయ ఏకాదశి.. ఇలా చేశారో విజయం మీ సొంతం
‘‘ఆ టైంలో నేను కూడా స్టేజ్‌పై ఉన్నాను. రామ్ చరణ్‌ను(Ram Charan Vs Shah Rukh) ఇడ్లీ, వడా అని పిలవడంతో నాకు కోపం వచ్చింది. ఆయనను అలా పిలవడం నాకు నచ్చలేదు. దీంతో వెంటనే స్టేజ్ దిగి కిందకు వెళ్లిపోయాను. బాలీవుడ్‌కు టాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ అంటే చిన్నచూపు అనేది ఈ ఘటనతో మరోసారి రుజువైంది’’ అని జెబా హాసన్ ఈ పోస్టులో వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవారు. కానీ దానికి టాలీవుడ్ చెరిపేసింది. ఇప్పుడు ఇండియన్ మూవీ అంటే టాలీవుడ్ అంటున్నారు. బాహుబలి తర్వాత తెలుగు సినిమా, టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ వైడ్‌గా గుర్తింపు పొందింది. ఇక ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంతో చరణ్ ఇంటర్నేషనల్ వైడ్‌గా గుర్తింపు పొందారు.
Shah Rukh Khan being casually racist to Ram Charan who is South Indian by calling him idli.
I wonder if his so called well educated and sophisticated fanbase will condemn it pic.twitter.com/sPSAenJND8
— yang goi (@GongR1ght) March 4, 2024