సినీ అభిమానులకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 27, 2026న విడుదల కానుంది. అయితే జూబ్లీహిల్స్‌లో ఉన్న రామ్ చరణ్ అద్భుతమైన ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మ్యాజిక్ బ్రిక్స్ నివేదిక ప్రకారం.. రామ్ చరణ్ నివాసం 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. విశాలమైన పచ్చని తోటతో కూడిన ఈ ఇల్లు, ఆధునికత, సంప్రదాయం కలగలిపిన రాజభవనంలా కనిపిస్తుంది. తెలుపు రంగులో ఉండే ఈ ఇల్లు గాజు పలకలతో అందంగా రూపొందించబడింది. ఇంటి బయట విశాలమైన తోట, కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడానికి అనువైన ప్లాటాని కలిగి ఉంది.
Kangana : ఆ సమయంలో వచ్చే బాధ.. ఎంపీలకూ తప్పదు.. కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు
ఇంటి లోపలికి అడుగుపెట్టగానే రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన అభిరుచి తెలుస్తుంది. ఈ ఇంటీరియర్స్ ఆధునికత, సంప్రదాయ వారసత్వాన్ని కలిపి డిజైన్ చేశారు. పెద్ద కిటికీలు ఇంటికి వెలుతురును అందిస్తాయి. నలుపు, తెలుపు రంగులలో ఉన్న ఫ్లోరింగ్ ఇంటికి రాజసౌందర్యాన్ని తీసుకువస్తుంది. ఈ ఇంట్లో అనేక చెక్క కళాఖండాలు, ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన వస్తువులు ఉన్నాయి. ఈ లగ్జరీ నివాసం విలువ రూ. 38 కోట్ల పైమాటే అంటున్నారు.
రామ్ చరణ్ ఇల్లు కేవలం ఆయన, ఆయన భార్య కోసం మాత్రమే కాకుండా, మూడు తరాల కొణిదెల కుటుంబానికి నిలయం. తన తండ్రి చిరంజీవి, కుమార్తె క్లిన్ కారా కొణిదెలతో సహా, ఈ ఇల్లు కుటుంబ అనుబంధాలకు చిహ్నంగా నిలిచింది. ఇక రామ్ చరణ్ పెద్ది విషయానికి వస్తే, బుచ్చి బాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా గ్రామీణ నేపథ్యం లోని క్రికెట్ టోర్నమెంట్ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, దివ్యేందు, జగపతి బాబు వంటి నటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.