Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే అప్‌డేట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్, చరణ్ మేకోవర్‌కు సంబంధించిన వార్తలు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
జిమ్‌లో చెమటోడుస్తున్న చరణ్
గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం రామ్ చరణ్ తన రూపాన్ని పూర్తిగా మార్చేశారు. ఈ పాత్ర కోసం ఆయన భారీ కాయాన్ని పెంచారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోను చరణ్ పంచుకున్నారు. తన బైసెప్స్‌ను ప్రదర్శిస్తూ ఆయన ఇచ్చిన పోజు చూస్తుంటే, ‘పెద్ది’లో చరణ్ విశ్వరూపం చూపించబోతున్నారని స్పష్టమవుతోంది.
ఈ ఫోటోకు చరణ్ ఇచ్చిన క్యాప్షన్ మరింత ఆసక్తికరంగా ఉంది. “మంట పుట్టిస్తున్నాను (Fired up). నిశ్శబ్దంగా పని చేస్తున్నాను. తదుపరి సవాల్‌కు సిద్ధం!” అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయి, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Also Read: బ్రిక్స్ నౌకాదళ విన్యాసాలకు భారత్ డుమ్మా.. కారణమిదే?!
మార్చి 27, 2026న గ్రాండ్ రిలీజ్
వృద్ధి సినిమాస్ పతాకంపై అత్యున్నత సాంకేతిక విలువలలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో రికార్డులను తిరగరాస్తున్నాయి.
భారీ తారాగణం.. అద్భుతమైన టెక్నీషియన్స్
ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇది ఆమెకు తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, హిందీ నటులు దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి వారు కీలక పాత్రల్లో మెరవనున్నారు. బుచ్చిబాబు సానా ఈ సినిమాను కేవలం ఒక క్రీడా నేపథ్య చిత్రంగానే కాకుండా బలమైన భావోద్వేగాలు కలిగిన ఒక గ్రామీణ గాథగా తీర్చిదిద్దుతున్నారు. రామ్ చరణ్ కష్టం, బుచ్చిబాబు విజన్, రెహమాన్ సంగీతం అన్నీ కలిస్తే ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మరో చరిత్ర సృష్టించడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
