Site icon HashtagU Telugu

Game Changer : బాలీవుడ్‌లో ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌కి ఇబ్బంది.. ఆ టైంలోనే..

Ram Charan, Game Changer, Aamir Khan

Ram Charan, Game Changer, Aamir Khan

Game Changer : దాదాపు మూడేళ్ళ నుంచి ఎదురు చూస్తున్న రామ్ చరణ్ అభిమానుల ఎదురు చూపులకు ఈ ఏడాది శుభం కార్డు పడబోతోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. తమ ప్రొడక్షన్ లో 50వ ప్రాజెక్ట్ కావడంతో దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని ఈ డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు దిల్ రాజు ఇటీవల తెలియజేసారు. ఇక ఈ రిలీజ్ అప్డేట్ చరణ్ అభిమానులను ఫుల్ ఖుషి చేసింది.

అయితే ఒక విషయం మాత్రం చరణ్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. అదేంటంటే, ఈ సినిమా రిలీజ్ సమయంలోనే టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పలు మోస్ట్ అవైటెడ్ సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్ లో అల్లు అర్జున్ ‘పుష్ప 2’, చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలు గేమ్ ఛేంజర్ కి రెండు వారలు అటు ఇటు రిలీజ్ అవుతున్నాయి. కానీ హాలీవుడ్, బాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యే సినిమాలు మాత్రం.. గేమ్ ఛేంజర్ విడుదల తేదిలోనే రిలీజ్ కాబోతున్నాయి.

గేమ్ ఛేంజర్ ని డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక అదే రోజు హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ యానిమేటెడ్ సీక్వెల్ ‘ముఫాస’ రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ విషయానికి వస్తే.. ఆమిర్ ఖాన్ తన రీ ఎంట్రీతో చరణ్ కి పోటీగా వస్తున్నారు. గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమిర్ ఖాన్ రీ ఎంట్రీ కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఇక వారి క్యూరియాసిటీని తెలుసుకున్న ఆమిర్.. ‘సితారే జమీన్ పర్’తో రీ ఎంట్రీని ప్రకటించారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం డిసెంబర్ 20నే రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుందట. ఒకవేళ ఇదే నిజమైతే.. నార్త్ బెల్ట్ లో గేమ్ ఛేంజర్ ని భారీగా రిలీజ్ చేయడం కష్టం అవుతుంది. దీంతో కలెక్షన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మరి చరణ్ ఈ పోటీని ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి.