Game Changer : గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమోనే ఈ రేంజ్ లో ఉందంటే.. ఇక టీజర్, ట్రైలర్, సినిమా ఏ లెవెల్లో ఉంటాయో..

టీజర్ కి ముందు ఇంకో చిన్న టీజర్ ప్రోమో అని నిన్న రాత్రే విడుదల చేసారు.

Published By: HashtagU Telugu Desk
Ram Charan Game Changer Teaser Promo Released Teaser Releasing Today

Game Changer Teaser Promo

Game Changer : దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మూడేళ్ళుగా ఈ సినిమా మీద కష్టపడుతున్నారు. ఇటీవలే వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటించబోతున్నాడు ఈ సినిమాలో. భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాను. గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయి ట్రెండ్ అవ్వగా నేడు టీజర్ రిలీజ్ కానుంది. లక్నోలో టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించి గేమ్ ఛేంజర్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే టీజర్ కి ముందు ఇంకో చిన్న టీజర్ ప్రోమో అని నిన్న రాత్రే విడుదల చేసారు. దీంతో ఈ గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో వైరల్ గా మారింది.

ఇందులో హీరో ఫేస్ చూపెట్టకుండానే హీరోకి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చినట్టు చూపించారు. టీజర్ ప్రోమోనే అదిరిపోయేలా ఉంటే ఇక టీజర్, ట్రైలర్ లో ఇంకేమీ చూపిస్తారో, సినిమాని ఏ రేంజ్ లో ప్లాన్ చేసారో అని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఆచార్య తర్వాత చాలా గ్యాప్ తో ఈ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ అంతా గేమ్ ఛేంజర్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అటు భారతీయుడు 2 తర్వాత శంకర్ కి కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ గా మారింది. నేడు సాయంత్రం గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేలోపు మీరు కూడా ఈ గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో చూసేయండి..

 

Also Read : Prabhas : మొదలయిన సలార్ 2 షూటింగ్.. మరి ఎన్టీఆర్ – నీల్ సినిమా? ఒకేసారి మూడు సినిమా షూటింగ్స్ తో ప్రభాస్..

 

 

  Last Updated: 09 Nov 2024, 08:55 AM IST