Site icon HashtagU Telugu

Ram Charan : దేవర హిట్ గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటో..?

Games Changer

Games Changer

ఎన్టీఆర్ (NTR) కొరటాల శివ కంబోలో వచ్చిన దేవర రిలీజ్ రోజు టాక్ ఎలా ఉన్నా ఫైనల్ గా సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. అఫీషియల్ గా నిర్మాతలే సినిమా వారం రోజుల్లో 400 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని ప్రకటించారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్ టీ ఆర్ చేసిన ఈ సినిమా రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ వల్ల ఫెయిల్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఈసారి రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ దేవర విషయంలో పనిచేయలేదు.

ఫైనల్ గా దేవర (Devara) హిట్ ఖాతాలో చేరింది. ఇన్నాళ్లకు రాజమౌళి సినిమా తర్వాత ఒక హీరో హిట్ కొట్టడం జరిగింది. ఐతే తారక్ ఆర్.ఆర్.ఆర్ ని అసలు లెక్కలోకి తీసుకోలేదు. ఆరేళ్ల తర్వాత సోలో సినిమా అంటూ చెబుతూ ప్రమోషన్స్ చేశారు. అదే ఫ్యాన్స్ కి బీభత్సంగా ఎక్కేసింది. RRR సినిమా లో చరణ్ ఎంత భాగమో తారక్ కూడా అంతే భాగం. అందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది చెప్పడం కష్టం.

కానీ ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ (Ram Charan) ఆచార్య రూపంలో ఫ్లాప్ ఫేస్ చేశాడు. ఐతే దేవర వచ్చి హిట్ కొట్టింది కాబట్టి నెక్స్ట్ చరణ్ నుంచి వస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేవర హిట్ కొట్టాడు మరి ఇప్పుడు గేమ్ చేంజర్ ఏం చేస్తాడో అని ఫ్యాన్స్ అంతా వెయిటింగ్ లో ఉన్నారు.

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ భారీతనంతో వస్తుంది. ఈ సినిమాతో మరోసారి చరణ్ తన బాక్సాఫీస్ స్టామినా చూపించాలని చూస్తున్నాడు.