Site icon HashtagU Telugu

Ram Charan Game Changer : గేమ్ చేంజర్ రన్ టైం లాక్..!

Games Changer

Games Changer

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో తలకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. ఇతర రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఆల్రెడీ తెలుగులో కియరా అద్వాని మహేష్ తో భరత్ అను నేను చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో చేసింది. ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించాలని చూస్తుంది అమ్మడు.

గేమ్ చేంజర్ సినిమా జనవరి 10 2025న రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా గురించి మెగా ఫాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. గేమ్ చేంజర్ సినిమాకు తమన్నా మ్యూజిక్ అందిస్తున్నారు. గేమ్స్ సినిమా రన్ టైం లాక్ అయినట్టు తెలుస్తుంది.

సంక్రాంతి బరిలో బాలకృష్ణ..

సినిమాను 162 నిమిషాలు అనగా రెండు గంటల 42 నిమిషాలకు రన్ టైం ఫిక్స్ చేశారట. ఇండియన్ 2 తో భారీ డిజాస్టర్ మూట కట్టుకున్న శంకర్ గేమ్ చేంజర్ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సంక్రాంతి బరిలో బాలకృష్ణ డాకు మహారాజ్. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వస్తున్నాయి. ఈ రెండిటికి గట్టి పోటీ చాలా రామ్ చరణ్ సినిమా వస్తుంది.

శంకర్ మార్క్ టేకింగ్.. చరణ్ నుండి మెగా ఫ్యాన్స్ కోరుతున్న అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆచార్య నిరాశపరచడంతో గేమ్ చేజర్ మీదే మెగా ఫ్యాన్స్ అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.