Site icon HashtagU Telugu

Ram Charan : గేమ్ ఛేంజర్ లెక్క తేలట్లేదు..?

Chiranjeevi Ram Charan Mega Treat for Mega Fans Dasara Festival

Chiranjeevi Ram Charan Mega Treat for Mega Fans Dasara Festival

Ram Charan ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం క్లారిటీ రాలేదు. శంకర్ గేమ్ ఛేంజర్ తో పాటు కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా తీయడమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. హీరో రెండు సినిమాలు తీయడం వేరు డైరెక్టర్ రెండు సినిమాలను డైరెక్ట్ చేయడం వేరు. ఇండియన్ 2 సెటప్ అంతా వేరు.. గేమ్ ఛేంజర్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఈ రెండిని బ్యాలెన్స్ చేస్తూ షూట్ చేయాల్సి వచ్చింది.

ఇక ఇండియన్ 2 సినిమా ఈ నెల రిలీజ్ అవుతుండగా గేమ్ ఛేంజర్ రిలీజ్ పై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. నిర్మాత దిల్ రాజు కూడా ఏమో శంకర్ ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తామని అంటున్నాడు. అసలు ఇంతకీ గేమ్ ఛేంజర్ ని ఈ ఇయర్ రిలీజ్ చేసే ఆలోచన ఉందా లేదా అని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నరు. గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ విషయంలో లెక్క తేలట్లేదు. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా తన మార్క్ సోషల్ మెసేజ్ ఇస్తున్నాడు శంకర్. సినిమాలో చరణ్ కి జోడీగా కియరా అద్వాని నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. దసరాకి స్లాట్ ఖాళీగా ఉంది. దీపావళికి కూడా గేమ్ ఛేంజర్ తెస్తే బాగుంటుంది. మరి మేకర్స్ సినిమా రిలీజ్ పై ఏం ఆలోచిస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది.