Site icon HashtagU Telugu

Ram Charan : క్రిస్మస్ కి గేమ్ చేంజర్.. మెగా ఫ్యాన్స్ లో సంతోషం ఎందుకు లేదంటే..?

Chiranjeevi Ram Charan Mega Treat for Mega Fans Dasara Festival

Chiranjeevi Ram Charan Mega Treat for Mega Fans Dasara Festival

మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్లోబల్ స్టార్ రాం చరణ్ గేమ్ చేంజర్ (Ram Charan Game Changer) సినిమా క్రిస్మస్ కి రిలీజ్ అంటూ నిర్మాత దిల్ రాజు హింట్ ఇచ్చారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ చేస్తున్న రాయన్ ఈవెంట్ లో దిల్ రాజు ఈ విషయాన్ని వెల్లడించారు. శంకర్ డైరెక్షన్ లో చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ పై ఎప్పటి నుంచో సస్పెన్స్ కొనసాగుతుంది.

ఫైనల్ గా సస్పెన్స్ కి తెర దించుతూ క్రిస్మస్ కి సినిమాను రిలీజ్ అని చెప్పేశారు. చరణ్ ఈ సినిమా విషయంలో చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. ఐతే క్రిస్మస్ (Christmas) రేసులో ఆల్రెడీ నితిన్ రాబిన్ హుడ్, నాగ చైతన్య తండేల్ లు వస్తున్నాయి. ఆ సినిమాల రిలీజ్ డేట్ ముందే ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు చరణ్ గేమ్ చేంజర్ సినిమా క్రిస్మస్ కే అని అంటున్నారని మెగా ఫ్యాన్స్ లో కన్ ఫ్యూజన్ మొదలైంది.

అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu) కూడా క్రిస్మస్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్. మరి బాబాయ్ తో అబ్బాయ్ ఫైట్ చేసే ఛాన్స్ లేదు. ఇండియన్ 2 ఫ్లాప్ అయిన సందర్భంగా శంకర్ (Shankar) సినిమాకు మరో సినిమా పోటీ వచ్చేలా అయితే గేమ్ చేంజర్ ని దిల్ రాజు రిలీజ్ చేసే అవకాశం లేదు. మరి క్రిస్మస్ కి ఏ సినిమా ఉంటుంది ఏది వాయిదా పడుతుంది అన్నది చూడాలి.

ఈ సినిమా తర్వాత చరణ్ బుచ్చి తో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ అటెంప్ట్ చేస్తారని టాక్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ సినిమా లో చరణ్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.